Sleep Talking: నిద్రలో ఎందుకు మాట్లాడతారు? నిద్రలో మాట్లాడడం అనేది ప్రమాదకరమా?-why do you talk in your sleep is sleep talking dangerous ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleep Talking: నిద్రలో ఎందుకు మాట్లాడతారు? నిద్రలో మాట్లాడడం అనేది ప్రమాదకరమా?

Sleep Talking: నిద్రలో ఎందుకు మాట్లాడతారు? నిద్రలో మాట్లాడడం అనేది ప్రమాదకరమా?

Haritha Chappa HT Telugu
Apr 19, 2024 07:00 PM IST

Sleep Talking: కొంతమంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారు. రకరకాల శబ్ధాలు చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసుకోండి. స్లీప్ టాకింగ్ చేయడానికి కారణాలను వైద్యులు వివరిస్తున్నారు.

స్లీప్ టాకింగ్
స్లీప్ టాకింగ్

Sleep Talking: కొంతమందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. దీన్నే స్లీప్ టాకింగ్, సోమ్నిలోకి అని అంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా వైద్యులకు ఆసక్తికరమైన టాపిక్‌గా మారింది. కొంతమంది గొణగడం వంటివి చేస్తే, మరికొందరు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. నిద్రలో ఎందుకు మాట్లాడతారు? కారణాలేంటి? అనే విషయాలను వైద్యులు వివరిస్తున్నారు.

నిద్రలో మాట్లాడడం అనేది ఒక పారాసోమ్నియా గానే భావించాలని చెబుతున్నారు వైద్యులు. అంటే నిద్రలో జరిగే ఒక ప్రవర్తన. ఇది ఎవరికీ హాని చెయ్యదు. అలాగే దీన్ని వైద్య సమస్యగా పరిగణించాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారు. నిద్రలో మాట్లాడేవారు, శబ్దాలు చేసేవారు, ప్రసంగించేవారు ఇలా రకరకాలుగా ఉంటారు.

మూడు ఏళ్ల నుంచి పది ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు ఎక్కువగా ఇలా నిద్రలో మాట్లాడుతూ ఉంటారు. అర్ధరాత్రి పూట ఉదయం తాము చేసిన పనులలో ఏదో ఒక పని గురించి వారు మాట్లాడే అవకాశం ఉంది. ఇక పెద్దల విషయానికి వస్తే ఇలా నిద్రలో మాట్లాడే వారి సంఖ్య తక్కువే. కేవలం ఐదు శాతం మంది మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఇది జన్యుపరమైన సమస్యగా కూడా భావించవచ్చు. కుటుంబంలో ఎవరికైనా నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటే అది తరాలుగా వస్తూనే ఉంటుంది.

నిద్రలో మాట్లాడడానికి ఖచ్చితమైన కారణాన్ని ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. దీనికి కలలు కనడంతో సంబంధం ఉండవచ్చని అంటున్నారు. భావోద్వేగాలు, ఒత్తిడి, కొన్ని రకాల మందులు వాడడం, జ్వరం, మానసిక ఆరోగ్య రుగ్మతలు వంటివి కూడా నిద్రలో మాట్లాడడానికి దోహదం చేస్తాయని వివరిస్తున్నారు.

నిద్రలో కొన్ని సెకన్ల పాటు మాట్లాడి ఆపేస్తే పెద్ద సమస్య ఉండదు, కానీ ఎక్కువసేపు అదే పనిలో ఉంటే పక్కవారికి నిద్రాభంగం కలిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు వైద్య నిపుణులు సంప్రదించాలి. స్లీప్ టాకింగ్ తగ్గించుకోవడం కోసం స్థిరమైన నిద్ర షెడ్యూల్‌ను ఫాలో అవ్వడం వంటి వాటి వల్ల ఇలా నిద్రలో మాట్లాడే సమస్య తగ్గే అవకాశం ఉంది. అలాగే స్లీప్ మేనేజ్మెంట్ టెక్నిక్‌లను కూడా తెలుసుకోవాలి. దీనికోసం వైద్యుల సలహాలను తీసుకోవాలి. నిద్రలో మాట్లాడడం పెద్ద సమస్య కాదు. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

WhatsApp channel