Hindi Diwas 2022 : హిందీ దివస్‌ని ఎందుకు చేస్తారో తెలుసా?
Hindi Diwas 2022 : దేశ అధికార భాషగా హిందీని స్వీకరించినందుకు గుర్తుగా.. ప్రతి సంవత్సరం హిందీ దివస్ లేదా జాతీయ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హిందీ భాష ప్రాముఖ్యతను హైలైట్ చేసేందుకు దీనిని నిర్వహిస్తారు. అయితే ఈ హిందీ దివస్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Hindi Diwas 2022 : దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను సెప్టెంబర్ 14, 1949న భారతదేశ అధికారిక భాషగా స్వీకరించారు. మొదటి హిందీ దివస్ సెప్టెంబర్ 14, 1953న నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీని దేశ అధికార భాషగా స్వీకరించినందుకు గుర్తుగా హిందీ దివస్ లేదా జాతీయ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 1977లో ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగం చేయడం గమనార్హం. భాష పట్ల ఆయన తన మద్దతును ఇలా తెలియజేశారు. అందుకే ఈరోజు హిందీ భాష ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. యువ తరాలను హిందీ మాట్లాడేలా ప్రోత్సహిస్తుంది.
అంతేకాకుండా హజారీ ప్రసాద్ ద్వివేది, కాకా కలేల్కర్, మైథిలీ శరణ్ గుప్త్, సేథ్ గోవింద్ దాస్‌లతో పాటు హిందీని రెండు అధికారిక భాషలలో ఒకటిగా మార్చడానికి కృషి చేసిన బెయోహర్ రాజేంద్ర సింహా జన్మదినాన్ని కూడా ఈ రోజు సూచిస్తుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు హిందీ దివాస్‌ను పురస్కరించుకుని బహుళ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. భాషని ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా దాని గురించి అవగాహన కల్పించడానికి.. అన్ని భారతీయ రాయబార కార్యాలయాలు కూడా ఈ దినోత్సవాన్ని పాటిస్తాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 43.6 శాతం మంది ప్రజలు హిందీ మాట్లాడతారని గుర్తించారు. మాండరిన్, ఇంగ్లీష్ తర్వాత.. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే మూడవ భాష హిందీ. భారతదేశంలోనే కాదు, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, USA, UK, జర్మనీ, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉగాండా, గయానా, సురినామ్, ట్రినిడాడ్, మారిషస్, దక్షిణాఫ్రికాతో సహా అనేక ఇతర దేశాలలో హిందీని మాట్లాడతారు.
ఇంగ్లీష్‌లా కాకుండా.. హిందీ భాషలోని ప్రతి వర్ణమాలకూ ప్రత్యేకమైన, స్వతంత్ర ధ్వని ఉంటుంది. హిందీ పదాలు వ్రాసిన విధంగా ఖచ్చితంగా మాట్లాడతాము. హిందీని నేర్చుకోవడానికి సులభమైన భాషగా వర్ణిస్తారు. ముఖ్యంగా ఆంగ్ల భాష ఇప్పుడు తరచుగా ఉపయోగించే అనేక పదాలు.. హిందీ పదాలనుంచి స్వీకరించినవే. అవతార్, బందన్న, డింగీ, గురు, యోగా, జంగిల్, ఖాకీ, కర్మ, లూట్, మంత్రం, నిర్వాణ, పైజామా, సోర్బెట్, టైఫూన్ వంటి పదాలు హిందీ నుంచి తీసుకున్న కొన్ని ఇంగ్లీష్ పదాలకు ఉదాహరణలు.
సంబంధిత కథనం
టాపిక్