Janmashtami fast timings: కృష్ణాష్టమిరోజు ఉపవాసం ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో ముగించాలి?-when should fasting be done on krishna ashtamiro at what time should it end ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Janmashtami Fast Timings: కృష్ణాష్టమిరోజు ఉపవాసం ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో ముగించాలి?

Janmashtami fast timings: కృష్ణాష్టమిరోజు ఉపవాసం ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో ముగించాలి?

Haritha Chappa HT Telugu
Aug 26, 2024 10:02 AM IST

Janmashtami fast timings: జన్మాష్టమి పర్వదినాన ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఏ సమయంలో ఉపవాసం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోండి.

కృష్ణాష్టమి ఉపవాస నియమాలు
కృష్ణాష్టమి ఉపవాస నియమాలు

జన్మాష్టమి అనేది శ్రీకృష్ణుని జన్మదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందంతో నిర్వహించుకునే పండుగ. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీ సోమవారం ఈ పండుగను నిర్వహించుకుంటున్నా. ఈ పండుగ చుట్టూ సంప్రదాయాలు, ఆచారాలు ఎన్నో ఉన్నాయి. ఈ పండుగను భాద్రపద మాసంలోని అష్టమి తిథి లేదా కృష్ణ పక్షం ఎనిమిదో రోజున నిర్వహించుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటించేవారికి కొన్ని నియమాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

జన్మాష్టమి 2024 ఉపవాసం ఎప్పుడు పాటించాలి?

అష్టమి తిథి ప్రారంభం - 03:39 AM, ఆగస్టు 26, 2024

అష్టమి తిథి ముగిసే సమయం - 02:19 AM ఆగస్టు 27, 2024

రోహిణి నక్షత్రం ప్రారంభం -03:55 PM, ఆగస్టు 26, 2024

రోహిణి నక్షత్రం ముగిసే సమయం - 03:38 PM, ఆగస్టు 27, 2024

  • శ్రీకృష్ణుని పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటించండి, మీరు అన్ని నియమాలను జాగ్రత్తగా పాటించేలా చూసుకోండి. రోజంతా శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూ ఉండండి.
  • ప్రీ ఫాస్ట్ మీల్: జీర్ణక్రియను కాపాడుకునేందుకు, పగటిపూట శక్తిని శరీరానికి అందించేందుకు ఉపవాసానికి ముందే పండ్లు లేదా తాజా రసాలు వంటి తీసుకోండి. లేదా తేలికపాటి భోజనం తినండి. ఆ తరువాత ఉసవాసం మొదలుపెట్టండి
  • దానధర్మాలు: నిరుపేదలకు ఆహారం, దుస్తులు ఇవ్వడం ద్వారా శ్రీకృష్ణుని కరుణను పొందవచ్చు. ఇలా చేస్తే మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి.
  • సాత్విక్ భోజనం: స్వచ్ఛమైన, శాఖాహార ఆహారాన్ని మాత్రమే ఈరోజు తినాలి. ఈ పవిత్రమైన రోజున వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, ఆల్కహాల్ కు దూరంగా ఉండండి.
  • పాలు, పెరుగు: తాజా ఫ్రూట్ షేక్స్, లస్సీ, మజ్జిగ లేదా రోజ్ మిల్క్ వంటివి తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో కూడా వీటిని తినవచ్చు.
  • ఇంట్లో తయారుచేసిన ప్రసాదం: ఇంట్లో వండిన ఆహారాలనే ప్రసాదాలుగా పెట్టండి. పాలతో తయారుచేసిన స్వీట్లను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెడితే ఆయన సంతోషిస్తాడు.

ఈ పనులు చేయవద్దు

  • మాంసాహారానికి దూరంగా ఉండండి: ఉపవాస సమయంలో పండ్లు తినడం, శాఖాహారమే తినడం చేయాలి. మాంసాహార ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
  • టీ, కాఫీలు వద్దు: ఉపవాసం ఉన్నప్పుడు టీ, కాఫీలకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి అసిడిటీని పెంచుతాయి. పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వీటికి బదులుగా కొబ్బరి నీరు లేదా తాజా రసాలను ఎంచుకోండి.
  • సమస్త జీవరాశులను గౌరవించండి: ముఖ్యంగా జన్మాష్టమి నాడు అన్ని ప్రాణులను దయతో చూసుకోండి. సకల జీవరాశులపై, ముఖ్యంగా ఆవులపై ప్రేమను చూపించండి. శ్రీకృష్ణుని ప్రేమకు గుర్తుగా జంతువులకు ఆహారం, పక్షులకు నీరు అందించండి.
  • ఆయిల్ ఫుడ్స్: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వేయించిన ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించండి. బదులుగా పండ్లు, పాలు, హెర్బల్ టీలు ఎంచుకోండి.
  • శుభ్రమైన పాత్రలు: ఉపయోగించే అన్ని పాత్రలు శుభ్రంగా ఉన్నాయని, అవి మాంసాహారానికి ఉపయోగించలేదని నిర్ధారించుకున్నాకే వాటిలో వండండి.
  • సానుకూల వాతావరణం: పూజ సమయంలో మీ ఇంట్లో ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించండి. ఉపవాసం ఉన్నవారు ముఖ్యంగా వృద్ధుల పట్ల దయగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.

టాపిక్