Whatsapp:వాట్సప్ యూజర్లకు ఇక పండగే.. పేమెంట్ చేయండి.. క్యాష్‌బ్యాక్‌‌ పొందండి!-whatsapp releases new payments promotion ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Whatsapp:వాట్సప్ యూజర్లకు ఇక పండగే.. పేమెంట్ చేయండి.. క్యాష్‌బ్యాక్‌‌ పొందండి!

Whatsapp:వాట్సప్ యూజర్లకు ఇక పండగే.. పేమెంట్ చేయండి.. క్యాష్‌బ్యాక్‌‌ పొందండి!

Apr 29, 2022, 09:42 PM IST HT Telugu Desk
Apr 29, 2022, 09:42 PM , IST

  • వాట్సాప్ తన డిజిటల్ చెల్లింపు సేవలను విస్తృతం చేసి దిశగా అడుగులు వేస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు క్యాష్-బ్యాక్ ఆఫర్‌లను విడుదల చేస్తోంది. వాట్సాప్‌లోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా మూడు వేర్వేరు కాంటాక్ట్‌లకు డబ్బు పంపడం ద్వారా రూ. 11 క్యాష్‌బ్యాక్‌ను మూడు సార్లు గెలుచుకునే అవకాశాన్ని కంపెనీ అందిస్తోంది.

మొత్తంగా రూ.33 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ పొందడానికి వాట్సాప్ కొన్ని నిబంధనలను రూపొందించింది. వినియోగదారులు అర్హులైన రిసీవర్‌కి డబ్బు పంపుతున్నప్పుడు యాప్‌లో ప్రమోషన్ బ్యానర్ లేదా బహుమతి చిహ్నాన్ని చూడాలి. వారు కనీసం 30 రోజుల పాటు వాట్సాప్ యూజర్‌ అయి ఉండాలి. QR కోడ్ చెల్లింపులు, UPI ID మరే ఇతర ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ల చెల్లింపులకు ఈ క్యాష్‌బ్యాక్ వర్తించదు.

(1 / 6)

మొత్తంగా రూ.33 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ పొందడానికి వాట్సాప్ కొన్ని నిబంధనలను రూపొందించింది. వినియోగదారులు అర్హులైన రిసీవర్‌కి డబ్బు పంపుతున్నప్పుడు యాప్‌లో ప్రమోషన్ బ్యానర్ లేదా బహుమతి చిహ్నాన్ని చూడాలి. వారు కనీసం 30 రోజుల పాటు వాట్సాప్ యూజర్‌ అయి ఉండాలి. QR కోడ్ చెల్లింపులు, UPI ID మరే ఇతర ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ల చెల్లింపులకు ఈ క్యాష్‌బ్యాక్ వర్తించదు.(HT_PRINT)

మీరు ఇంకా వాట్సాప్ పేమెంట్ సర్వీస్‌ని ప్రారంభించనట్లయితే.. వాట్సాప్ పేమెంట్ ఖాతాను ఇలా ఓపెన్ చేయండి

(2 / 6)

మీరు ఇంకా వాట్సాప్ పేమెంట్ సర్వీస్‌ని ప్రారంభించనట్లయితే.. వాట్సాప్ పేమెంట్ ఖాతాను ఇలా ఓపెన్ చేయండి(Bloomberg)

మెుదటగా యూజర్స్ తమ బ్యాంక్ ఖాతాకు, మొబైల్ నంబర్‌ను లింక్ చేసి ఉండాలి. తర్వాత వాట్సాప్‌లో కుడి వైపున ఉన్న మూడు-చుక్కల చిహ్నంపై క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ సంబంధించిన ఆప్షన్‌ను పొందుతారు.

(3 / 6)

మెుదటగా యూజర్స్ తమ బ్యాంక్ ఖాతాకు, మొబైల్ నంబర్‌ను లింక్ చేసి ఉండాలి. తర్వాత వాట్సాప్‌లో కుడి వైపున ఉన్న మూడు-చుక్కల చిహ్నంపై క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ సంబంధించిన ఆప్షన్‌ను పొందుతారు.(Pixabay)

దానిపై క్లిక్ చేయడం ద్వారా యాడ్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఇతర సమాచారం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చివరిగా నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి.. కాల్‌, మెసేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.

(4 / 6)

దానిపై క్లిక్ చేయడం ద్వారా యాడ్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఇతర సమాచారం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చివరిగా నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి.. కాల్‌, మెసేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.(Bloomberg)

UPI పాస్ కోడ్‌ను ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. ఈ విధంగా మీరు వాట్సాప్‌లో చెల్లింపుల కోసం నమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

(5 / 6)

UPI పాస్ కోడ్‌ను ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. ఈ విధంగా మీరు వాట్సాప్‌లో చెల్లింపుల కోసం నమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.(HT_Print)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు