Potato In Fridge : ఉడికించిన బంగాళాదుంపలు ఫ్రిజ్‍లో పెడుతున్నారా?
Summary: ఉడికించిన బంగాళాదుంపలు ఫ్రిజ్ లో పెట్టి స్టోర్ చేస్తున్నారా? అలా చేస్తే మీ కూర రుచి పాడైపోవడం మాత్రమే కాదు ఆరోగ్యం చెడిపోతుంది.
బంగాళాదుంప అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. ఉడికించి లేదా వేపుడు మాదిరి ఎలా చేసుకున్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. టొమాటో కెచప్ లో డిప్ చేసుకుని తింటుంటే ఆహా అనిపిస్తుంది కదా.
ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా బంగాళాదుంప ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనార్థాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఫ్రిజ్ లో పెట్టకూడని ఆహారాల్లో ఇదీ ఒకటి. చల్లని వాతావరణం వల్ల వాటికి త్వరగా మొలకలు వస్తాయి.
కొంతమంది ఉడికించిన బంగాళాదుంపలు ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. అది ఎంత వరకు కరెక్ట్ అంటే అసలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల అందులో హానికరమైన పదార్థాలు చేరిపోతాయి. వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఆకృతి మారిపోతుంది
ఉడకబెట్టిన బంగాళాదుంపలు ఫ్రిజ్ లో పెడితే వాటి ఆకృతి మారిపోతుంది. చల్లటి వాతావరణం వల్ల అందులోని పిండి పదార్థాలు స్పటికాకార రూపంలోకి మారిపోతాయి. వాటిని మళ్ళీ వేడి చేసినప్పుడు పిండి పదార్థాల ఆకృతి చెడిపోతుంది.
రుచి ఉండవు
ఫ్రిజ్ లో పెట్టడం వల్ల బంగాళాదుంపల రుచి పూర్తిగా చప్పగా మారిపోతుంది. మెత్తగా ఉండే దుంపలు గట్టిగా అయిపోతాయి. ఉడకబెట్టిన దుంపల రుచి అలాగే ఉండాలంటే వాటిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవడం మంచిది. అది మాత్రమే కాదు ఉడికించిన బంగాళాదుంపలు ఎటువంటి మూత పెట్టకుండా బయట ఉంచడం వల్ల వాటి రంగు కూడా మారిపోయే అవకాశం ఉంది.
క్యాన్సర్ ప్రమాదం
దుంపలు ఉడికించడం లేదంటే కాల్చడం వల్ల అందులో యాక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుంది. వీటిని ఉడికించిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టి మళ్ళీ వేడి చేయడం వల్ల అక్రిలామైడ్ స్థాయిలు పెరుగుతాయి. గది ఉష్ణోగ్రత వద్ద వాటిని నిల్వ చేయడం వల్ల అక్రిలామైడ్ స్థాయిలు పెరిగే ప్రమాదం తగ్గుతుంది.
ఉడికించిన వాటిని వేడి చేస్తే అందులో క్యాన్సర్ కారకాలు ఏర్పడే అవకాశం ఉంది. చల్లగా ఉన్న వాటిని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల అందులోని చక్కెరలు, అమైనో ఆమ్లాలు క్యాన్సర్ తో సంబంధం ఉన్న అక్రిలామైడ్ పదార్థం స్థాయిలు పెరుగుతాయి. అందుకే వాటిని వేడి చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.
పోషకాలు ఉండవు
ఉడికించిన బంగాళాదుంపలు పోషకాల పవర్ హౌస్ గా పేర్కొంటారు. కానీ వాటిని శీతలీకరణం చేయడం వల్ల అందులోని విటమిన్ శి వంటి కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు కోల్పోయే అవకాశం ఉంది. దీని పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మాత్రం గది ఉష్ణోగ్రత వద్ద ఉంచుకోవడమే మంచిది.
చెడిపోతాయి
ఏవైనా పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయని అనుకుంటారు. కానీ అది బంగాళాదుంపలకి వర్తించదు. ఉడికించినవి ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి మరింత త్వరగా చెడిపోతాయి. అలాగే తీపి రుచికి మారిపోతుంది. వాటిని తాజాగా ఉంచాలంటే చల్లని వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేయడం ఉత్తమం.