2 Condoms : కండోమ్‍తో లైంగిక ఆసక్తి తగ్గుతుందా? ఒకేసారి 2 వాడితే ఏం జరుగుతుంది?-what happens if you use 2 condoms at once ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2 Condoms : కండోమ్‍తో లైంగిక ఆసక్తి తగ్గుతుందా? ఒకేసారి 2 వాడితే ఏం జరుగుతుంది?

2 Condoms : కండోమ్‍తో లైంగిక ఆసక్తి తగ్గుతుందా? ఒకేసారి 2 వాడితే ఏం జరుగుతుంది?

HT Telugu Desk HT Telugu
Oct 08, 2023 08:00 PM IST

Condoms : కొన్ని జంటలు కండోమ్స్ ఎక్కువగా వాడుతుంటాయి. వీటిని అధికంగా వాడటం వలన ఏదైనా ప్రభావం ఉందా? ఒకేసారి రెండు కండోమ్స్ ఉపయోగిస్తే ఏం జరుగుతుంది?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

కరోనా సమయంలో కండోమ్స్ వాడకం ఎక్కువగా జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంట్లోనే ఉండటం, గర్భం దాల్చకూడదనే ఆలోచనలతో వీటి కొనుగోలు ఎక్కువైంది. అంతకుముందు, ఆ తర్వాత కూడా వీటిని ఉపయోగించే జనాలు ఎక్కువే ఉన్నారు. కొంతమంది వాడకూడదని అంటే.. మరికొందరేమో వాడొచ్చు అని చెబుతుంటారు.

చాలా మంది జంటలు గర్భధారణను నిరోధించడానికి గర్భనిరోధకాలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా కండోమ్‌లను ఎక్కువగా వాడుతారు. అయితే దీని వినియోగంపై చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. కొంతమంది రెండు కండోమ్‌లను కలిపి ఉపయోగిస్తారు? ఇలా చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కండోమ్ వాడకం చాలా మంచిది. ఎందుకంటే ఇది అనేక అంటువ్యాధులు, ఇతర లైంగిక సంక్రమణ వ్యాధుల నుండి రక్షిస్తుంది. అవి ఇతర రకాల గర్భనిరోధకాల కంటే మెరుగైనవి.

కండోమ్‌లను ఉపయోగించడం వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించవచ్చు. అంతే కాదు అవాంఛిత గర్భధారణ అవకాశాలను తగ్గించడంలో కూడా కండోమ్‌లు ఎంతగానో సహకరిస్తాయి.

కానీ కొందరు ఒక కండోమ్ వాడితే.. ఏమవుతుందోననే భయంతో రెండింటిని వాడుతారు. దీనిద్వారా సమస్యలను నివారించాలని కోరుకుంటారు. రెండు వాడితే.. ఇక ఏం కాదు అనే ఆలోచనతో ఉంటారు. అయితే శాస్త్రీయంగా ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఎందుకంటే ఒకేసారి రెండు కండోమ్‌లు వాడితే వాటి మధ్య చాలా ఒత్తిడి, రాపిడి ఉంటుంది. ఫలితంగా అది చిరిగిపోయి నిరుపయోగంగా మారుతుంది. ఎన్నో ఏళ్లుగా కండోమ్‌లు వాడుతున్న వారిలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. కండోమ్‌ల అధిక వినియోగం లైంగిక కోరికలు, లైంగిక అనుభూతులను తగ్గిస్తుందని చెబుతారు.

అయితే, ఇండియానా యూనివర్సిటీ 2007లో నిర్వహించిన ఒక అధ్యయనంలో కండోమ్‌లను ఉపయోగించడం వల్ల లైంగిక ఆనందం, భావాలు తగ్గవని తెలిసింది. అవాంఛిత గర్భం, లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించడానికి మాత్రమే కండోమ్‌లు ఉపయోగపడతాయని గమనించాలి. ఈ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అయితే రెండు కండోమ్స్ కాకుండా.. సరైనది ఒకటి ఉపయోగించినా చాలు అనేది నిపుణులు చెప్పే మాట.

Whats_app_banner