Wednesday Vibes : నువ్ గతానికి బందీవైతే.. భవిష్యత్ నిర్మించుకోలేవ్
Wednesday Motivation : గతం చెప్పేందుకు రెండు అక్షరాలే.. కానీ కొన్ని సార్లు జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇస్తుంది. మోయలేని భారాన్ని కూడా ఇస్తుంది. కానీ దానికి బందీ అయిపోతే.. భవిష్యత్ అంధకారమవుతుంది.
ఆ మనిషిని చాలా ప్రేమించాను.. కానీ నన్ను వదిలిపోయారు. నా అనుకున్నవాళ్లు నిలువునా మోసం చేశారు... ఇలా కొంతమంది.. చెబుతూ ఉంటారు. కానీ చెబితే.. నొప్పి కలిగేది నీ నోరుకే. గతం చెబితే.. ప్రస్తుతం మారిపోదు.. అలా మారిపోయే అవకాశం ఉంటే.. అందరూ గతంలోనే బతుకుతారు. అవే మాటలు చెబుతారు. అందుకే గతం ఒక అనుభవం.. భవిష్యత్ కు గొప్ప పాఠం.. ప్రస్తుతానికి మీ భవిష్యత్ పునాది నిర్మాణం. గతంలోనే బతికితే.. గతంలోనే ఉండిపోతావ్. మానసికంగా, శారీరకంగా మీకే నష్టం.
ఇప్పటి వరకూ నువ్ గాలిలో మేడలు కట్టివుంటే.. బాధపడాల్సిన పనేమీ లేదు.. వాటిని అలానే ఉండనివ్వు.. కానీ ఇప్పటికైనా వాటి కింద పునాది నిర్మించడం మెుదలుపెట్టు.
కొంతమంది గతంలోనే బతికేస్తారు. రోజులు గడుస్తాయి.. సంవత్సరాలు గడుస్తాయి. కానీ వాళ్లు మాత్రం.. గతం తాలుకు జ్ఞాపకాల్లోనే ఉంటారు. ప్రేమలో మోసపోయమనో.. బాగా నమ్మినవాళ్లు ముంచేశారనో.. స్నేహితులు వెన్నుపోటు పొడిచారనో.. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. అయితే ఆ రిలేషన్ షిప్ లో నువ్ స్వచ్ఛంగా ఉన్నావ్ కదా.. అది చాలు. నీ మనసు స్వచ్ఛమైనదే.. నిన్ను మోసం చేసినవాళ్లదే మలినమైన మనసు. నీ లాంటి వ్యక్తిని కోల్పోయినందుకు బాధపడాల్సింది వాళ్లు. నువ్ గతం గురించి ఆలోచిస్తే లాభం లేదు.
గతాన్ని ప్రస్తుతంలోకి తీసుకురావొద్దు.. అలా చేస్తే.. భవిష్యత్ కూడా.. గతంలాగే మారిపోతుంది. మీతో ఉండేవాళ్లు కూడా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తారు. అప్పుడు మీరు ఇంకా.. ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే.. గతాన్ని గతంలోనే వదిలేసి.. ప్రస్తుతంలో బతికితే.. సరైన భవిష్యత్ కు పునాది పడుతుంది. వస్తాయ్.. ఆలోచనలు వస్తాయ్.. కానీ కొత్తగా ఏదైనా విషయాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నించండి. మీ గతం మీకు ఓ గురువు కావాలి కానీ.. కాలు పట్టుకుని కిందకు లాగే శత్రువు కాకూడదు.
బాధపెట్టడం గతం లక్షణం.., భయపెట్టడం భవిష్యత్ లక్షణం. గతాన్ని తలుచుకోని బాధ పడటం వలన, భవిష్యత్ ను ఊహించుకుంటూ భయపడటం వలన, వర్తమానం ఆందోళనగా మారుతుంది. నిన్నటి నుంచి నేర్చుకోవాలి గానీ, నీ నిన్నటిలో నువ్ చిక్కిపోకూడదు. రేపటి గురించి ఆలోచన మంచిదే.. కానీ ఆందోళనే చెడ్డది..!
సంబంధిత కథనం