Vastu tips: ఇంట్లో చేపల అక్వేరియం ఏ దిశలో ఉంటే శుభప్రదమంటే?-vastu tips in which direction fish aquarium should be kept it is auspicious do this special vastu remedy today ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Vastu Tips In Which Direction Fish Aquarium Should Be Kept It Is Auspicious Do This Special Vastu Remedy Today

Vastu tips: ఇంట్లో చేపల అక్వేరియం ఏ దిశలో ఉంటే శుభప్రదమంటే?

HT Telugu Desk HT Telugu
Oct 06, 2022 08:44 PM IST

అక్వేరియం ప్రకృతిలోని ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ఈ 5 మూలకాలు కలిసి సానుకూల శక్తిని సృష్టిస్తాయి. వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటిలో చేపల అక్వేరియంను సరైన దిశలో ఉంచడం వల్ల ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.

fish aquarium
fish aquarium

వాస్తు శాస్త్రం ప్రకారంగా, ఇంటిలో ఉంచే అక్వేరియం స్థానం సానుకూల శక్తిని అదేవిధంగా సంతోషం, శ్రేయస్సును అందిస్తుంది. వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్లో చేపల ఆక్వేరియం ఉంచడం వల్ల ఇంటి వాతావరణం ఆటోమేటిక్‌గా సంతోషంగా మారుతుంది. మరోవైపు, చేపల అక్వేరియంను వాస్తు విరుద్దంగాఉంచడం వల్ల మనుషులపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది.

అక్వేరియం ప్రకృతిలోని ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాజిటివ్ ఎనర్జీని సృష్టించడం కొరకు ఈ 5 ఎలిమెంట్‌లు కలిసి పనిచేస్తాయి. ప్రవహించే నీటి నుండి వేరే రకమైన ధ్వని ఉత్పత్తి అవుతుంది, దీని వల్ల చుట్టుపక్కల వాతావరణం సానుకూల శక్తితో నిండి ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారంగా ఇంటిలో చేపల అక్వేరియంను ఎక్కడ ఉంచాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

- చేపల అక్వేరియం వాస్తుశాస్త్రంలో చాలా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. చేప అక్వేరియంలో ఉంచిన నీరు జీవాన్ని చూపిస్తుంది. అక్వేరియంలో ప్రవహించే నీరు సానుకూల శక్తిని చూపుతుంది. ఇది మీ జీవితాన్ని ప్రశాంతంగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది.

- వాస్తు శాస్త్రం ప్రకారం, అక్వేరియంను లివింగ్ రూమ్ యొక్క నైరుతి దిశలో ఉంచాలి. లివింగ్ రూమ్ లో అక్వేరియం ఉంచడం మీకు ఇష్టం లేకపోతే, ఉత్తర దిశలో వేరే ప్రదేశంలో ఉంచండి.

ఆఫీసులోని అక్వేరియంను రిసెప్షన్ ప్రాంతానికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి.

- అక్వేరియంను ప్రధాన ద్వారం యొక్క ఎడమ దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారంగా, ఇలా చేయడం ద్వారా, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది.

- ఫిష్ ట్యాంక్ ను ఎల్లప్పుడూ లివింగ్ రూమ్ నైరుతి దిశలో ఉంచాలి. తద్వారా ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ సులభంగా కనిపిస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం