వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద ఈ గదులు ఉంటే అశుభం!
ఇంటి లోపల నిర్మించే మెట్ల విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. రోజువారీగా ఉపయోగంచే గదులను మెట్ల కింద ఉండకూడదు. అయితే తరుచుగా ఉపయోగించే స్టోర్‌రూమ్‌ల వంటి గదులను నిర్మించుకోవచ్చని శాస్త్రం చెబుతుంది
వాస్తు ప్రకారంగా ఇంటిలోని ప్రతి నిర్మాణం ప్లాన్ ప్రకారంగా ఉండాలి. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో, మెట్ల దిశ చాలా ముఖ్యమైనది. . ఇల్లు కట్టేటప్పుడు స్థలాన్ని ఆదా చేసేందుకు చాలా మంది మెట్ల కింద పూజ గది, వంటగది లేదా బాత్రూమ్‌ను నిర్మిస్తుంటారు. వాస్తు ప్రకారంగా మెట్ల కింద ఇలాంటి నిర్మాణాలను చేపట్టకూడదు. రోజువారీగా ఉపయోగంచే గదులు మెట్ల కింద ఉండకూడదు. అయితే తరుచుగా ఉపయోగించే స్టోర్‌రూమ్‌ల వంటి గదులను నిర్మించుకోవచ్చని శాస్త్రం చెబుతుంది. వీటిని రోజువారీగా ఉపయోగించకూడదు.
అలాగే మెట్ల కింద, బూట్లు లేదా చెప్పులు ఉంచుకునే వార్డ్రోబ్ లేదా అల్మారాలను కూడా ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే మెట్ల కింద కుళాయి పిట్ చేయకుండా ఉంటే మంచిది. మెట్ల కింద ట్యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడంలో సమస్య లేనప్పటికీ, ఒకవేళ ఉంటే అది లీక్ కాకుండా జాగ్రత్త వహించండి. మీరు ప్రతిరోజూ మీ మెట్లను తుడుస్తూ ఉండాలి. స్టెప్స్ కింద డస్ట్‌బిన్‌ను ఉంచవద్దు. డస్ట్‌బిన్ వల్ల జెర్మ్స్, దోమలు, కీటకాలు వస్తాయి. అలాగే ఇంట్లో ప్రతికూల పరిస్థితులకు కారణమవుతుంది.
మీ మెట్లపై లైట్ ఉండేలా చూసుకోండి. చీకటిగా ఉంచవద్దు. అలాగే వెలుతురు మరీ ప్రకాశవంతంగా లేకుండా జాగ్రత్తపడాలి. లైట్ వల్ల మెట్లపై వచ్చే రంగు ప్రకారంగా వాటి ప్రభావం ఉంటుంది . ఇంట్లో మెట్లు ఎప్పుడూ వంటగది, పూజా గది లేదా స్టోర్ రూమ్ గేటు నుండి మొదలవకూడదు లేదా ముగించకూడదు. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర నుండి మెట్లు ప్రారంభించాలి.
సంబంధిత కథనం