Ulavacharu Veg Biryani: ఉలవచారు వెజ్ బిర్యానీ ఇలా ఇంట్లోనే సులువుగా చేసేయండి, ఒక్కసారి తింటే మరి వదలరు
Ulavacharu Veg Biryani: శాకాహారుల కోసం ఇక్కడ బెస్ట్ రెసిపీ ఇచ్చాము, అదే ఉలవచారు వెజ్ బిర్యానీ. వండడం కష్టం అనుకుంటారు కానీ చాలా సులువుగా వండేయచ్చు. రెసిపీ ఎలాగో చూసేయండి.
Ulavacharu Veg Biryani: ఉలవచారు బిర్యానీ తినాలంటే అందరూ రెస్టారెంట్‌కే వెళ్తూ ఉంటారు. నిజానికి దాన్ని ఇంట్లో కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఉలవచారు బిర్యానీ పేరు వింటేనే అది వండడం కష్టం అనే భావన చాలామందికి వచ్చేస్తుంది. నిజానికి ఇది చాలా సింపుల్ గా వండవచ్చు. ఇక్కడ మేము సింపుల్ స్టెప్స్ లో ఉలవచారు బిర్యాని రెసిపీ ఇచ్చాము. దీన్ని ఫాలో అవ్వండి చాలు.
ఉలవచారు వెజ్ బిర్యానీ రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉలవలు - అరకప్పు
బాస్మతి రైస్ - ఒక కప్పు
బంగాళాదుంప - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
కాలీఫ్లవర్ ముక్కలు - పావు కప్పు
ఫ్రెంచ్ బీన్స్ - 5
క్యారెట్లు - రెండు
బిర్యానీ ఆకులు - రెండు
లవంగాలు - నాలుగు
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
చింతపండు గుజ్జు రసం- రెండు స్పూన్లు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
జాపత్రి - రెండు ఆకులు
యాలకులు - నాలుగు
నూనె - సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - అయిదు
ఉలవచారు వెజ్ బిర్యానీ రెసిపీ
1. ఉలవలను శుభ్రంగా కడిగి ఆరు గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
2. తర్వాత కుక్కర్లో వేసి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
3. అలా ఉడికించిన తర్వాత వడకట్టి నీటిని ఒక గిన్నెలో ఉంచాలి.
4. ఉడికిన ఉలవలను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్టులా చేసి గ్రైండ్ చేయాలి.
5. ఆ పేస్టును కూడా పక్కన పెట్టుకున్న ఉలవల నీటిలో వేసి బాగా కలుపుకోవాలి.
6. అని ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేయాలి.
7. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మళ్లీ వడకట్టి చిక్కటి నీటిని వేరుచేసి గుజ్జును చేత్తోనే పిండి పక్కన పెట్టేయాలి.
8. ఆ ఉలవల మీరే ఈ బిర్యాని చేయడానికి ముఖ్యం. కొబ్బరి నుంచి కొబ్బరి పాలను తీసి ఎలా వండుతామో అలానే ఉలవల నుంచి ఉలవల నీటిని వేరు చేసి వండుతాము.
9. ఇప్పుడు బాస్మతి రైస్ ను ముందుగానే నీటిలో వేసి నానబెట్టుకోవాలి.
10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కుక్కర్ పెట్టి నూనె వేయాలి.
11. ఆ నూనెలో లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి.
12. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించుకోవాలి.
13. అవి రంగు మారేవరకు వేయించాక ముందుగా కోసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బంగాళదుంప ముక్కలను వేసి వేయించుకోవాలి.
14. అందులోనే పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
15. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసి బాగా కలపాలి.
16. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
17. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఉలవ నీటిని వేసి బాగా కలపాలి.
18. అలాగే రెండు స్పూన్ల చింతపండు చిక్కటి రసాన్ని కూడా వేసి కలపాలి.
19. మూత పెట్టి అన్నం ఉడికే వరకు ఉంచాలి.
20. స్టవ్ కట్టేసేముందు పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. అంతే టేస్టీ ఉలవచారు వెజ్ బిర్యానీ రెడీ అయినట్టే.
దీన్ని రైతాతో తింటే రుచి అదిరిపోతుంది. ఇది పూర్తి శాకాహారమే, కాబట్టి శాఖాహారులు, మాంసాహారులు ఇద్దరూ దీన్ని తినవచ్చు.
ఉలవలు ఒకప్పుడు అధికంగా తినేవారు. కానీ ఇప్పుడు తినడం మానేశారు. నిజానికి ఉలవలు తినడం వల్ల మనకున్న ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి అప్పుడప్పుడు ఉలవలతో చేశారని ఆహారాలను తినడం అలవాటు చేసుకోండి. పోషకాలు మన శరీరానికి అందాల్సిన అవసరం ఉంది.