Mexican Corn Fritters Recipe। మొక్కజొన్న వడలను మెక్సికన్ స్టైల్లో చేసి చూడండి, మళ్లీ మళ్లీ తింటారు!
Mexican Corn Fritters Recipe: ఇక్కడ మీకు మెక్సికన్ కార్న్ ఫ్రిట్టర్స్ రెసిపీని పరిచయం చేస్తున్నాం. ఇవి సాంప్రదాయ మెక్సికన్ స్ట్రీట్ కార్న్ నుండి ప్రేరణ పొందాయి. మీ మాన్‌సూన్ సాయంత్రానికి గొప్ప స్నాక్స్‌గా , పార్టీ స్టార్టర్‌గా ఉంటాయి.
Monsoon Recipes: వర్షాకాలంలో మనకు నోరూరించే స్ట్రీట్ ఫుడ్‌లలో మొక్కజొన్న పొత్తులు కూడా ఒకటి. మొక్కజొన్నను మనం కాల్చుకొని లేదా ఉడికించుకొని తింటాం. లేదా ఇంట్లో మొక్కజొన్న వడలను చాలా సార్లు చేసుకుని తినే ఉంటాం. అయితే ఇలా రెగ్యులర్‌గా కాకుండా మీరు చాలా రకాలుగా మొక్కజొన్న వడలను చేసుకోవచ్చు, మీరు కోడిగుడ్డును కలిపి కూడా మొక్కజొన్న వడలు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అలాంటి రెసిపీని పరిచయం చేస్తున్నాం. మెక్సికన్ కార్న్ ఫ్రిట్టర్స్ రెసిపీని మొక్కజొన్న, కోడిగుడ్డు కలిపి చేస్తారు. ఈ మొక్కజొన్న వడలు సాంప్రదాయ మెక్సికన్ స్ట్రీట్ కార్న్ నుండి ప్రేరణ పొందాయి. ఇవి చాలా రుచిగా ఉండటమే కాకుండా, మీ మాన్‌సూన్ సాయంత్రానికి గొప్ప స్నాక్స్‌గా , పార్టీ స్టార్టర్‌గా ఉంటాయి. మెక్సికన్ కార్న్ ఫ్రిట్టర్స్ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Mexican Corn Fritters Recipe కోసం కావలసినవి
- 2 కప్పులు ఒలిచిన మొక్కజొన్నలు
- 1/2 కప్పు కొత్తిమీర
- 1 నిమ్మకాయ
- 1 గుడ్డు
- 3 టేబుల్ స్పూన్లు మయోన్నైస్ సాస్
- 2 టీస్పూన్ చిల్లి పౌడర్
- 1/4 కప్పు కాటేజ్ చీజ్
- 1/4 కప్పు మైదా పిండి
- 1 టీస్పూన్ ఉప్పు/ రుచికి
- ¼ టీస్పూన్ మిరియాలు
- 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్
- వేయించడానికి 2 టేబుల్ స్పూన్లు నూనె
మెక్సికన్ మొక్కజొన్న వడలు తయారీ విధానం
- ముందుగా పెద్ద మిక్సింగ్ గిన్నెలో మొక్కజొన్న విత్తులు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, గుడ్డు, మయోన్నైజ్, కారం, కాటేజ్ చీజ్ వేసి మామూలుగా కలపండి.
- తరువాత మైదా, ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్ వేసి కలపండి, ఆపై విడిని విభజించి చిన్నని వడ ముద్దలుగా చేసుకోండి.
- ఇప్పుడు పెద్ద స్కిల్లెట్‌లో మీడియం వేడి మీద 1 టేబుల్ స్పూన్ అవోకాడో ఆయిల్ వేడి చేయండి.
- నూనె వేడి అయిన తర్వాత, మొక్కజొన్న మిశ్రమం ముద్దలు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కాల్చండి, ఆపై తిప్ప్పి మరొక వైపు అదనంగా 2 నిమిషాలు ఉడికించాలి. అవసరమైన విధంగా పాన్ లో అదనపు నూనె చిలకరించండి.
అంతే, మెక్సికన్ కార్న్ ఫ్రిట్టర్స్ రెడీ. మీకు నచ్చిన సాస్‌తో వేడివేడిగా సర్వ్ చేయండి.
సంబంధిత కథనం