ట్రూకాలర్‌లో సూపర్ ఫీచర్స్.. ఫ్రాంక్ చేయవచ్చు.. వీడియో కాలర్‌ ఐడీ పెట్టుకోవచ్చు!-true caller adds new features for android users ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ట్రూకాలర్‌లో సూపర్ ఫీచర్స్.. ఫ్రాంక్ చేయవచ్చు.. వీడియో కాలర్‌ ఐడీ పెట్టుకోవచ్చు!

ట్రూకాలర్‌లో సూపర్ ఫీచర్స్.. ఫ్రాంక్ చేయవచ్చు.. వీడియో కాలర్‌ ఐడీ పెట్టుకోవచ్చు!

Rekulapally Saichand HT Telugu
Feb 28, 2022 04:18 PM IST

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం ట్రూ కాలర్ చాలా ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీడియో కాలర్ ఐడీ, కాల్ రికార్డింగ్, ఘోస్ట్ కాల్, అనౌన్స్ కాల్ లాంటి ప్రీమియం ఫీచర్లను ప్రారంభించనున్నట్లు True caller వెల్లడించింది.

<p>ట్రూ కాలర్</p>
ట్రూ కాలర్
  • మీరు ఆండ్రాయిడ్ (Android) ఫోన్ వినియోగదారులా? కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూ కాలర్ (Truecaller)ని ఉపయోగిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ట్రూకాలర్ తన యూజర్స్ కోసం కొత్త అప్‌డెట్స్‌తో ముస్తాబవుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు  ట్రూ కాలర్ చాలా ఫీచర్స్‌ను అందించనుంది. వీడియో కాలర్ ఐడీ, కాల్ రికార్డింగ్, ఘోస్ట్ కాల్, అనౌన్స్ కాల్ లాంటి ప్రీమియం ఫీచర్లను ప్రారంభించనున్నట్లు Truecaller వెల్లడించింది.  వీటిలో ఘోస్ట్‌ కాల్, అనౌన్స్‌ కాల్‌ లాంటి ఫీచర్లను ప్రీమియం సబ్‌స్క్రైబర్ల కోసం కాగా..  మిగితావి ఉచితంగా అందిస్తుంది. ఇక ఈ  ఫీచర్ల గురించి మరింతగా తెలుసుకుందాం.

వీడియో కాలర్ ఐడీ (Video Caller ID)

ఈ ఫీచర్‌తో యూజర్లు కాలర్‌ ఐడీకి వీడియోను జోడించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఎవరికైనా కాల్ చేస్తే నంబర్, ఫోటో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ  సరికొత్త ఫీచర్‌తో ఎవరికైనా కాల్‌ చేసినప్పడు వారు లిఫ్ట్‌ చేయడానికి ముందే స్క్రీన్‌పై ఓ చిన్న వీడియో ప్లే అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా యూజర్లు తమకిష్టమైన వీడియోను  లేదా ఇన్ బిల్డ్ వీడియోలలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో మీరు కాల్ చేసిన ప్రతిసారీ ఆటోమేటిక్‌గా వీడియో ప్లే అవుతుంటుంది.

కాల్ రికార్డింగ్ (Call Recording)

కాల్ రికార్డింగ్ ఫీచర్‌ చాలా మంది కొరుకునే ఆప్షన్.. యూజర్స్ ఆలోచనకు తగ్గట్టుగా ఈ ఫీచర్‌ను రూపొందించారు. అయితే ఇది ట్రూ కాలర్‌లో ప్రీమియర్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌తో ఇన్‌కమింగ్‌, అవుట్ గోయింగ్ కాల్స్ రికార్డ్ చేయవచ్చు. వాటిని లోకల్ స్టోరేజ్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. వీటిని ఇతరులతో కూడా షేర్  చేసుకోవచ్చు. ఫోన్‌లో డిఫాల్ట్‌ రికార్డింగ్ ఆప్షన్ లేకపోయినా సరే ఈ ఫీచర్ పని చేస్తుంది. 

ఘోస్ట్‌ కాల్‌ ఫీచర్‌ (Ghost Call Feature)

ఈ ఫీచర్‌ కొంచెం ఫన్నీగా ఉంటుంది. ప్రాంక్‌ కాల్స్‌‌తో మీ సన్నిహితులను ఆటపట్టించొచ్చు. మీరు వారికి కాల్‌ చేసినప్పుడు మీ వివరాలు కాకుండా ఇతరుల పేరు, నంబర్‌, ఫొటో కనిపించేలా మార్పులు చేసుకోవచ్చు. యూజర్‌ ఏ టైంకు ప్రాంక్‌ కాల్ చేయాలనుకుంటున్నాడో ఆ నిర్ణీత సమయానికి షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ ప్రీమియం, గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కాల్ అనౌన్స్ ఫీచర్ (Call Announce Feature)

ఈ ఫీచర్ ద్వారా ఇన్‌కమింగ్‌ కాల్ చేసేవారి పేర్లను స్పీకర్ ద్వారా వినవచ్చు. రింగ్‌టోన్‌‌లాగా వారి పేర్లను ఈ ఫీచర్ వినిపిస్తుంది. మీరు ఫోన్‌కు కాస్త దూరంగా ఉన్నప్పటికి ఈ ఆప్షన్‌ను ఎనబుల్ చేసుకుంటే ఎవరు కాల్ చేస్తున్నారనేది ఈజీగా తెలుసుకోవచ్చు.

 

Whats_app_banner

సంబంధిత కథనం