Summer Foods | ఎండాకాలంలో చలువ చేసే లైమ్ కొకొనట్ ఐస్ క్రీమ్!
లైమ్ కొకొనట్ ఐస్ క్రీమ్ రుచిలో ఎంత గొప్పగా ఉంటుందో, దీనిని తయారు చేయడం అంత సులభంగా ఉంటుంది. మూడు స్టెప్పుల్లో ఇలా తయారుచేసుకోండి.
Ice Cream (Pixabay)
కొబ్బరితో ఎన్నో ఉపయోగాలున్నాయి, ముఖ్యంగా అది శరీరానికి చలువ చేస్తుంది. అయితే ఇప్పుడు హిమ క్రీములను ఆస్వాదించే కాలం నడుస్తుంది. మరి చల్లచల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే మనకు మనంగానే సింపుల్‌గా చేసుకోవచ్చు. దానికి కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే నిమ్మకాయ టచ్ ఇస్తే ఆ ఫ్లేవర్ ఈ వేసవిలో మీకు మంచి కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్స్ మోర్ అంటూ మళ్లీ మళ్లీ లాగించేస్తారు. అయితే లైమ్ కోకోనట్ ఐస్ క్రీమ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ రెసిపీ అందిస్తున్నాం. ట్రై చేసి చూడండి.
లైమ్ కోకోనట్ ఐస్ క్రీమ్ తయారీ కోసం కావలసినవి
* 400 గ్రాముల కొబ్బరి క్రీమ్ లేదా కొబ్బరి పాలు
* 2 నిమ్మకాయలు
* అర కప్ కొబ్బరి చక్కెర, తేనె లేదా చక్కెర
తయారీ విధానం
- ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకొని, కొకొనట్ క్రీమ్ వేసి, నిమ్మకాయ రసం పిండండి, ఆ తర్వాత మిగతా పదార్థాలు వేసి గిలక్కొట్టండి, చక్కెర పూర్తిగా కరిగిపోయేంతవరకు బాగా మిక్స్ చేయండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ఐస్‌క్రీం మేకర్‌లో ఉంచి ఫ్రీజ్ చేయండి. లేదా డీప్ -రీఫ్రిజరేటర్లో నాలుగు గంటల పాటు క్రీమ్ గడ్డకట్టేంత సేపు ఉంచాలి.
- లైమ్ కొకొనట్ ఐస్ క్రీమ్ రెడీ అయినట్లే.. ఇప్పుడు ఈ ఐస్ క్రీంను సర్వింగ్ గిన్నెలోకి తీసుకొని నిమ్మకాయ తొక్కను సన్నగా తరిగి ఐస్ క్రీమ్ మీద టాపింగ్ లాగా గార్నిష్ చేసుకోవాలి.
- స్వచ్ఛమైన కొబ్బరి, నిమ్మ సమ్మిళితమైన లైమ్ కొకొనట్ ఐస్ క్రీంను చల్లచల్లగా ఆస్వాదించండి.
సంబంధిత కథనం