చర్మానికి టోనర్‌ను వాడుతున్నారా? లేదా? అయితే ఇప్పుడే స్టార్ట్ చేయండి..
శీతాకాలం బాధ తప్పింది అనుకోగానే.. సమ్మర్ వచ్చేసింది. చర్మానికి మరింత సంరక్షణ అందిచాల్సిన సమయం. ఎండలో తిరిగితే చర్మం కమిలిపోవడం, వాపు రావడం సహజమే. వేసవి వేడికి రంగు మారిపోవడం, టాన్ అయిపోతుంటాం. మరి ఈ సమ్మర్లో చర్మాన్ని రక్షించుకోవడం మన పనే. ఏ సీజన్లో అయినా టోనర్‌ను ఉపయోగిస్తే చాలా లాభాలు ఉంటాయన్నారు చర్మ సంరక్షణ నిపుణులు.
Skin Care | చర్మాన్ని శుభ్రం చేయడం, మాయిశ్చరైజింగ్ చేయడం అనేవి చర్మ సంరక్షణలో రెండు ముఖ్యమైన దశలు. కానీ వాటితో పాటే టోనర్లు కూడా అంతే ముఖ్యం. కానీ టోనర్లు కూడా చర్మానికి అంతే మేలు చేస్తాయి. దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. మీరు కూడా వాటిని వెంటనే ప్రారంభిస్తారు. ముందు టోనర్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
రంధ్రాల రూపాన్ని తగ్గిస్తుంది
జిడ్డు చర్మం ఉన్నవారు.. అధికంగా సెబమ్ ఉత్పత్తి కాకుండా ఉండాలంటే టోనర్‌ను ఉపయోగించవచ్చు. చర్మంపై పెద్ద రంధ్రాలు ఎక్కువగా జిడ్డును విడుదల చేస్తాయి. రంధ్రాలను తగ్గించేందుకు టోనర్ బాగా సహాయం చేస్తుంది. పైగా మృదువైనా చర్మాన్ని ఇస్తుంది.
చర్మాన్ని బిగుతుగా చేస్తుంది
టోనర్లు రంధ్రాల రూపాన్ని తగ్గించడమే కాకుండా.. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. కాలక్రమేణా ముడతలు కూడా తగ్గిస్తుంది.
మేకప్ తొలగిస్తుంది
ఒక్కోసారి మేకప్‌ను తొలగించినా... కాస్త కూస్తో ముఖం మీద మేకప్ ఉండిపోతుంది. దానిని వదిలించుకోవడానికి, చర్మాన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవడానికి టోనర్‌ను ఉపయోగించవచ్చు.
రిఫ్రెష్
టోనర్‌తో మీ రోజును ప్రారంభించడం, ముగించడం వల్ల మీకు మంచి రిఫ్రెష్ కలుగుతుంది. దానిలోని సువాసన, అనుభూతి మీకు నూతనోత్తేజాన్ని ఇస్తుంది.
చర్మాన్ని రక్షిస్తుంది
టోనర్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం పై పొరను రక్షిస్తుంది మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది.
సహజ సిద్ధమైన టోనర్లు ట్రై చేయండి
రోజ్ వాటర్
మార్కెట్‌లో సులువుగా లభించే సహజమైన చర్మ సంరక్షణ పదార్ధం రోజ్ వాటర్. దీనిని నేరుగా చర్మానికి పూయవచ్చు. అంతే కాకుండా టోనర్‌గానూ ఉపయోగించవచ్చు.
కలబంద
కలబంద చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతేకాకుండా ఎండవల్ల కలిగే ఎరుపు, వాపును తగ్గిస్తుంది.
గ్రీన్ టీ
కేవలం గ్రీన్‌టీని తాగడానికి మాత్రమే కాదు.. అద్భుతమైన టోనర్‌గా కూడా ఉపయోగిస్తారు. గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా స్కిన్ టోన్‌ను కూడా పెంచుతుంది.
సంబంధిత కథనం