Breakfast Recipe : నిమ్మకాయ పులిహోర ఇలా కలపండి.. అలా తినేయండి..
అసలు పులిహోరకు మించిన అల్పాహారం ఏముంటుంది చెప్పండి. చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర.. ఇలా చెప్పుకుంటూపోతే.. ఎన్నోరకాలుగా దీనిని తయారుచేయవచ్చు. అయితే మరింత హెల్తీగా దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Today Breakfast Recipe : రాత్రి అన్నం మిగిలినా.. పొద్దున్నే టిఫెన్, లంచ్ రెండూ చేసే ఓపిక లేకపోయినా.. లంచ్ చేయడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి.. బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా చేయాలనుకున్నా.. పులిహోర బెస్ట్ ఆప్షన్ అనమాట. మరి ఈ పులిహోరను ఎలా కలపాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు
* అన్నం - 1 కప్పు
* నూనె - 2 స్పూన్లు
* ఇంగువ - చిటికెడు (ఆప్షనల్)
* ఆవాలు - అర టీస్పూన్
* కరివేపాకు - 10 ఆకులు
* ఎండుమిర్చి - 4
* పసుపు - 1 టీస్పూన్
* ఉప్పు - తగినంత
* నిమ్మరసం - 2 స్పూన్స్
* కొత్తిమీర - 2 స్పూన్స్
* వేరుశెనగ - 2 స్పూన్స్
* పచ్చిశెనగ పప్పు - 1 స్పూన్
* అల్లం - అర టీస్పూన్
నిమ్మకాయ పులిహోర తయారీ విధానం
స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి. దానిలో నూనె వేసి, ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడు ఇంగువ, కరివేపాకు, అల్లం, ఎండుమిర్చి, పల్లీలు, పచ్చిశెనగ పప్పు వేయాలి. వాటిని బాగా వేయించాలి.
అవిబాగా వేగాక పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి.. కలపాలి. ఇప్పుడు ఉప్పు, నిమ్మరసం వేసి అన్నంలో బాగా కలిసేలా కలపాలి. అంతే నిమ్మకాయ పులిహోర రెడీ. వేడి వేడిగా లాగించేయడమే తరువాయి.
సంబంధిత కథనం