Breakfast Dairies | మీరు హెల్తీ డైట్ ఫాలో అవ్వాలనుకుంటే.. ఈ స్మూతీ మీకోసమే..
మీరు మంచి హెల్తీ రెసిపీల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ స్మూతీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికే కాదండోయ్.. మీకు అనేక ప్రయోజనాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మీకు హెల్తీ హెయిర్, స్కిన్ కావాలనుకుంటే దీనిని కచ్చితంగా మీ డైట్లో యాడ్ చేసుకోండి.
Hulk Smoothie | హల్క్ స్మూతీ. దీనిని మీరు బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. జిమ్‌లో కసరత్తులు చేసి.. అలసిపోయిన శరీరానికి రోజంతా ఉత్సాహంగా ఉండేలా ఓ డ్రింక్ కావాలనుకుంటే.. ఈ స్మూతీ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా.. హెల్తీ హెయిర్‌కు, హెల్తీ స్కిన్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఈ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు (3 గ్లాసులకు)
* పాలకూర - 1 కట్ట
* అరటిపండ్లు - 2
* యాపిల్స్ - 2
* చియా సీడ్స్ - 2 స్పూన్స్
* బెల్లం లేదా హనీ - 2 లేదా 3 స్పూన్స్
* అల్లం - 1 చిన్న ముక్క
* కొబ్బరి పాలు - 1 కప్పు (డెయిరీ మిల్క్ కూడా వాడొచ్చు)
* యోగర్ట్ - 1 అరకప్పు
* ఐస్ క్యూబ్స్ - 1 కప్పు
తయారీ విధానం
మిక్సీజార్‌లో పాలకూర, అరటిపండ్లు, యాపిల్స్, చియా సీడ్స్, బెల్లం, అల్లం, కొబ్బరిపాలు, యోగర్ట్, ఐస్‌క్యూబ్స్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని.. మెత్తగా చేసుకోవాలి. రోజూ ఉదయాన్నే ఈ హల్క్ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే జిమ్ చేసినా లేదా వ్యాయమం చేసినా తర్వాత ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మీరు డే అంతా.. ఉత్సాహంగా ఉంటారు.
సంబంధిత కథనం