కళ్లుచెదిరే డిజైన్.. కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో Techno Phantom X స్మార్ట్‌ఫోన్!
టెక్నో కంపెనీ నుంచి ఫాంటమ్ X స్మార్ట్‌ఫోన్ విడుదలయింది. ముఖ్యంగా నేటితరం యువతను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లు ఇచ్చారు..
మొబైల్ తయారీదారు టెక్నో తాజాగా తమ బ్రాండ్ నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ ఎక్స్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే కలిగిన తొలి సెగ్మెంట్ ఫోన్. డిజైన్ పరంగా ఈ ఫోన్ గ్లాస్ బాడీతో వచ్చింది. ఈ ఫోన్ వెనుకవైపు 50MP ట్రిపుల్ కెమెరాలతో పాటు ముందు భాగంలో కూడా కళ్లు చెదిరే డ్యూయల్ సెల్ఫీ కెమెరాల సెటప్ ఇచ్చారు. దీంతో సెల్ఫీలు దిగటానికి, వీడియోస్ ఇంకా వ్లాగ్స్ చేయడాని ఈ ఫోన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
నేటి తరం యువత అభిరుచులను దృష్టిలో ఉంచుకొని అద్భుతమైన డిజైన్, స్పెసిఫికేషన్‌లతో అధునాతనమైన టెక్నాలజీను ఉపయోగించి ఈ ఫోన్ రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ సరికొత్త టెక్నో ఫాంటమ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Techno Phantom X స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల కర్వ్డ్ AMOLED FHD+ డిస్‌ప్లే
- 8 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్
- వెనకవైపు 50 మెగా పిక్సెల్ + 13MP + 8MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 48 MP+ 8 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 4700 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్
- ధర రూ. 25,999/-
మే 4 నుంచి Tecno ఫాంటమ్ X స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటూ బ్లూటూత్ స్పీకర్ అలాగే వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను ఉచితంగా కంపెనీ అందిస్తోంది.
సంబంధిత కథనం