Black Rice | బ్లాక్ రైస్.. రోజు రోజుకీ పెరుగుతున్న క్రేజ్-surprising benefits and uses of black rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Surprising Benefits And Uses Of Black Rice

Black Rice | బ్లాక్ రైస్.. రోజు రోజుకీ పెరుగుతున్న క్రేజ్

Himabindu Ponnaganti HT Telugu
Dec 16, 2021 12:35 PM IST

Black Rice | బ్లాక్ రైస్.. ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. అత్యంత పోషక విలువలు ఉన్న బియ్యం బ్లాక్ రైస్. ప్రతి 100 గ్రాముల నల్ల బియ్యంలో 8.5 గ్రాముల ప్రొటీన్లు, 3.5 గ్రాముల ఐరన్, 4.9 గ్రాముల ఫైబర్ ఉంటుందట.

బ్లాక్ రైస్
బ్లాక్ రైస్ (pexel)

బ్లాక్ రైస్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ మధ్య కాలంలో బాగా ఈ పేరు మార్కెట్లో వినిపిస్తుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఈ నల్ల బియ్యాన్ని పండిస్తున్నారు. మణిపూర్ లో ఎక్కువగా పండిస్తారు. నల్ల బియ్యంలో యాంథో సైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ బియ్యం నల్ల రంగులో ఉంటాయి. బ్లాక్ జపనికా రైస్, బ్లాక్ గ్లుటినస్ రైస్, ఇటాలియన్ బ్లాక్ రైస్, థాయ్ బ్లాక్ జాస్మిన్ రైస్ వంటి నాలుగు రకాల నల్ల బియ్యం ఉన్నాయి.

నల్ల బియ్యం ప్రయోజనాలు

వీటలో ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఇనుము, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో గ్లూకోజు స్థాయిని నియంత్రిస్తుంది. బీపీ సమస్య నుంచి కాపాడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉన్నందున ఒబెసిటీ సమస్య కూడా రాదు. నల్ల బియ్యంలో ఉండే యాంథో సైనిన్లు కంటి జబ్బులను నయం చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. లివర్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్