Strawberry Ice Tea | సమ్మర్​లో కూల్​ కూల్​గా.. స్ట్రాబెర్రీ ఐస్​ టీ-summer special drink strawberry iced tea making ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Strawberry Ice Tea | సమ్మర్​లో కూల్​ కూల్​గా.. స్ట్రాబెర్రీ ఐస్​ టీ

Strawberry Ice Tea | సమ్మర్​లో కూల్​ కూల్​గా.. స్ట్రాబెర్రీ ఐస్​ టీ

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 04, 2022 05:37 PM IST

స్ట్రాబెర్రీ ఐస్​ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది సమ్మర్​లో వేసవి తాపం నుంచి మనకి ఉపశమనం అందించే చక్కటి లిక్విడ్. ఈ ఐస్ టీ ఓ చక్కని కూల్​డ్రింక్ ఫీలింగ్​ని ఇచ్చి.. ఒక రిఫ్రెష్​మెంట్ కచ్చితంగా ఇస్తుంది. పైగా దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కూడా చాలా సులువు.

<p>స్ట్రాబెర్రీ ఐస్ టీ</p>
స్ట్రాబెర్రీ ఐస్ టీ

Strawberry Ice Tea | వచ్చేది వేసవి కాలం. ఇప్పటికే ఎండలు దుమ్మురేపుతున్నాయి. ఈ ఎండలను తట్టుకునేందుకు అందరూ శీతల పానీయాలను ఆశ్రయిస్తారు. ఎండ నుంచి కాస్త ఉపశమనం వాటినుంచే లభిస్తుందని భావిస్తుంటారు. వేసవిలో లభించే పండ్లతో జ్యూస్​లను తయారు చేసుకుని తాగుతారు. ఇవి హెల్త్​ని ఇవ్వడంతో పాటు.. వేడి నుంచి ఉపశమనం అందిస్తాయి. కానీ ఈసారి సమ్మర్​ను చల్లని టీతో ప్రారంభించి చూడండి.

టీతో ఏంటి వేడి తగ్గడం అనుకోవద్దు. ఇది స్ట్రాబెర్రీ ఐస్ టీ. పేరుకు తగ్గట్టుగానే దానిని చూసినప్పుడు, తాగినప్పుడు కూడా ఓ చక్కని ఫీల్ వస్తుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తయారీ విధానం

ఓ గిన్నేలో లీటర్​ నీళ్లు తీసుకుని బాయిల్ చేయాలి. అది మరుగుతున్నప్పుడు టీ పౌడర్ వేసి.. 5 నుంచి 6 నిముషాలు మరగనివ్వాలి. ఈ బ్లాక్​ టీని వడపోసి.. చల్లార్చి పక్కకు పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్​లో కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకోవాలి. మంచి ప్యూరీగా దానిని బ్లెండ్​ చేసుకోవాలి. ఈ ప్యూరీ చూసేందుకు చాలా బాగుంటుంది.

స్ట్రాబెర్రీ ప్యూరీ రెడీ అయిన తర్వాత.. ఓ గ్లాసులో ఐసు ముక్కలను తీసుకోవాలి. దానిలో 5 లేదా 6 స్పూన్​ల స్ట్రాబెర్రీ ప్యూరీని వెయ్యాలి. అనంతరం దానిలో తేనే, నిమ్మకాయరసం, కొంచెం సాల్ట్, కాస్త బ్లాక్​ టీ వేసుకోవాలి. వెంటనే పుదీనా ఆకులు వేసి.. క్లోజ్​ చేసి బాగా కలపాలి.

ఇప్పుడు మరో గ్లాస్​ తీసుకుని దానిలో మళ్లీ ఐస్​ క్యూబ్స్ వేసుకుని.. కొంచెం పుదీనా తరుగు, స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకుని... ఈ ఐస్​టీని వేసుకోవాలి. మంచిగా గార్నిష్ చేసుకుని తాగుతుంటే.. మీరు ఎండలో పడిన శ్రమనంతా మరిచిపోవడం ఖాయం.

Whats_app_banner