Natural Sugar Replacements : చక్కెరకు ఆరోగ్యకరమైన, సహజమైన ప్రత్యామ్నాయాలు ఇవే..
Natural Sugar Replacements : ప్రతి పండుగకి, వేడుకకి కచ్చితంగా స్వీట్స్ చేసుకుంటాము. కానీ దానిలో షుగర్ ఉపయోగిస్తాము. దీనివల్ల మధుమేహం ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారు వాటిని తినలేరు. వారికే కాదు.. పంచదార అనేది అంత మంచిది కాదని మనకి తెలుసు. మరి దానిని సహజంగా భర్తి చేయగలిగేవి ఏమున్నాయ్?
Natural Sugar Replacements : సాంప్రదాయ భారతీయ మిఠాయిల నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన డెజర్ట్‌ల వరకు.. చక్కెర అన్నింటిలో ఎక్కువ పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ.. దీనిని ఎక్కువగా ప్రాసెస్ చేయడం వల్ల.. ఊబకాయం, అధిక పొట్ట కొవ్వు, గుండె జబ్బులు, మధుమేహం సమస్యలను పెంచుతుంది.

అయితే పంచదారను కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయవచ్చు తెలుసా? పైగా ఇవి సహజమైనవి. అంతేకాకుండా కొన్ని పంచదార కంటే ఎక్కువ రుచిని అందిస్తాయి. ఇవి మీ ఆరోగ్యానికి మంచి కూడా చేస్తాయి. పైగా బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అవేంటో మీరు కూడా తెలుసుకోండి.
డేట్స్
ఉత్తమ సహజ స్వీటెనర్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఖర్జూరాలు కచ్చితంగా మొదటివరుసలో ఉంటాయి. ఇవి ఫ్రక్టోజ్ గొప్ప మూలంగా కలిగి ఉంటాయి. పైగా వీటిలో ఫైబర్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, ప్రోటీన్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అవి తీపి, ఆరోగ్యకరమైనవి. అంతేకాకుండా రుచికరమైనవి కూడా. ఇవి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా సులభం. కాబట్టి మీ మనసు స్వీట్ తినాలని అనుకుంటున్నప్పుడు.. ఆ క్రావింగ్స్ ఖర్జూరాలతో భర్తీ చేయండి.
తేనె
తేనెలో విటమిన్ సి, బి1, బి2, బి3, బి5, బి6 పుష్కలంగా ఉంటాయి. అదనంగా ఖనిజాలు, పొటాషియం, కాల్షియం కూడా లభిస్తాయి. తేనెలో మీ రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది చాలా తీపిగా ఉంటుంది. కాబట్టి మీరు షుగర్ కంటే తక్కువగానే దీనిని తీసుకోవచ్చు. తేనె చాలా వంటకాల్లో చక్కెరను సులభంగా భర్తీ చేస్తుంది.
బెల్లం
ప్రాసెస్ చేసిన చక్కెరకు బెల్లం సరైన ప్రత్యామ్నాయం. మనం సాధారణంగా ఉపయోగించే చక్కెరలా కాకుండా.. బెల్లాన్ని శుద్ధి చేయరు. అందుకే దీనిలో ఎక్కువ ఖనిజాలు, విటమిన్లు, తక్కువ సుక్రోజ్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన, సహజ ప్రత్యామ్నాయంగా చేస్తుంది. ఇది మొలాసిస్‌ను కూడా కలిగి ఉంటుంది.
స్టెవియా
స్టెవియా మొక్క ఆకులను ఉపయోగించి.. సున్నా కేలరీలతో ఈ చక్కెరను తయారు చేస్తారు. ఇది చక్కెర కంటే తియ్యగా ఉంటుంది. దీనితో మీరు బరువు పెరగడాన్ని సులభంగా నిరోధించవచ్చు. చక్కెరను స్టెవియాతో భర్తీ చేయడం ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గించవచ్చు. ఈ చక్కెర ప్రత్యామ్నాయం మధుమేహం లేదా ఊబకాయం ఉన్నవారికి చాలా గొప్పగా పనిచేస్తుంది. దీనిలో పిండి పదార్థాలు కూడా ఉండవు.
కొబ్బరి చక్కెర
మీ శక్తి స్థాయిలను పెంచే సహజమైన మొక్కల ఆధారిత చక్కెర కోసం మీరు వెతుకుతున్నట్లయితే.. కొబ్బరి చక్కెర బెస్ట్ ఆప్షన్. ఇది శాకాహార ఆహారంలో ప్రసిద్ధ స్వీటెనర్. దీనిలో ఇనుము, జింక్, కాల్షియం, పొటాషియం నిండుగా ఉంటాయి. అదనంగా కొబ్బరి చక్కెర తక్కువ రక్త చక్కెర స్థాయిలను నివారిస్తుంది. చక్కెర కంటే తక్కువ ప్రాసెస్ చేస్తారు.
సంబంధిత కథనం
టాపిక్