Dates Benefits : ఖర్జూరాలు ఆరోగ్యకరమైనవని అందరికి తెలుసు. కానీ వాటితో దీర్ఘకాలిక ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు. ఇవి రుచిగానూ ఉంటాయి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి వీటిని ఎవరైనా తీసుకోవచ్చు. వీటిలో సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, రాగి వంటి సూక్ష్మపోషకాలలో సమృద్ధిగా నిండి ఉంటాయి. అయితే ఖర్జూరం అందించే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక స్థాయి ఇంటర్‌లుకిన్ 6 (IL-6) అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్‌లను కలిగిస్తుంది. అయినప్పటికీ.. అధ్యయనాల ప్రకారం.. ఖర్జూరాలు IL-6 స్థాయిలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్‌తో సహా మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మీ మెదడు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇవి మీ జ్ఞాపకశక్తిని, అభ్యాస శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తాయి.
ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటిని రోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఫైబర్ మృదువైన పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం 21 రోజుల పాటు ప్రతిరోజూ ఏడు ఖర్జూరాలను తినే 21 మంది జీర్ణక్రియను మెరుగుపరిచింది. ఖర్జూరంలోని పీచు మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్, రాగి వంటి ముఖ్యమైన సూక్ష్మపోషకాలతో నిండిన ఖర్జూరం.. మీ ఎముకలను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా ఎముకలకు సంబంధించిన రుగ్మతలను దూరంగా ఉంచుతుంది. అదనంగా ఇవి విటమిన్ K తో నిండి ఉంటాయి. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడంలో సహాయం చేస్తుంది.
బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్న వారు.. ఎముకల పగుళ్లతో బాధపడే ప్రమాదం ఉంది. అలాంటివారు ఖర్జూరాలను రోజూ తీసుకోవడం వల్ల ఈ సమస్య మెరుగుపడుతుంది.
చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు చికిత్స కోసం ఇన్సులిన్ సప్లిమెంట్స్, మౌఖిక మందులు తీసుకుంటారు. అయినప్పటికీ.. రోజువారీ ఆహారంలో ఖర్జూరాన్ని జోడించడం వల్ల దానిని సహజంగా అదుపులో ఉంచవచ్చు. ఖర్జూరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది.
అవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. పేగుల నుంచి గ్లూకోజ్ శోషణ రేటును తగ్గించడంలో సహాయపడతాయి. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
మీ శక్తిని ఉత్తేజపరిచేందుకు, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి.. వ్యాయామానికి వెళ్లే ముందు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నాలుగు-ఐదు ఖర్జూరాలను తీసుకోవచ్చు.
ఫైబర్‌తో నిండినందున ఖర్జూరం మీకు ఎక్కువ కాలం కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. అనారోగ్యకరమైన చిరుతిండికి దూరంగా ఉండేలా చేస్తుంది.
సంబంధిత కథనం