Smoothies for breakfast: ఉదయాన్నే ఈ స్మూతీలు తాగితే.. అల్పాహారం తినక్కర్లేదు..
Smoothies for breakfast: ఉదయం అల్పాహారంలోకి స్మూతీలు తీసుకోవడం ఆరోగ్యకరం. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటూ, శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
అల్పాహారంలోకి స్మూతీలు తీసుకుంటే కడుపునిండదు అనుకోవద్దు. సరైన పద్ధతిలో స్మూతీ తయారు చేసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటూ కడుపూ నిండుతుంది. వీటిలో పండ్లు, నట్స్ కలుపుకోవడం వల్ల ఫైబర్ కూడా అందుతుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
స్మూతీలు:
కింద ప్రతి స్మూతీ కోసం కావాల్సిన పదార్థాలుంటాయి. వాటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకుంటే చాలు. స్మూతీ సిద్ధమైనట్లే.
1. బనానా బెర్రీ బ్లాస్ట్:
1 పండిన అరటిపండు
1 కప్పు బెర్రీలు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ)
సగం కప్పు పెరుగు
సగం కప్పు పాలు
1 చెంచా తేనె
2. గ్రీన్ గుడ్ నెస్:
1 కప్పు పాలకూర
సగం అవకాడో
సగం కప్పు పైనాపిల్ ముక్కలు
సగం కప్పు కీరదోస ముక్కలు
సగం కప్పు కొబ్బరి నీళ్లు
చెంచా నిమ్మరసం
3. పీనట్ బటర్ తో:
1 పండిన అరటిపండు
రెండు చెంచాల పీనట్ బటర్
1 కప్పు పాలు
1 చెంచా తేనె
కొన్ని ఐస్ క్యూబులు
4. చాకో బెర్రీ డిలైట్:
1 కప్పు బెర్రీలు ఏవైనా కలిపి తీసుకోవచ్చు
1 చెంచా కొకొవా పౌడర్
1 కప్పు బాదాం పాలు
సగం కప్పు పెరుగు
1 చెంచా తేనె
5. చియా బెర్రీ స్మూతీ:
1 కప్పు బెర్రీలు
1 చెంచా చియా గింజలు
సగం కప్పు బాదాం పాలు లేదా గేదె పాలు
సగం కప్పు పెరుగు
1 చెంచా తేనె
6. వెజ్జీ పవర్ హౌజ్:
సగం కప్పు పాలకూర
సగం కప్పు కీరదోస
సగం అవకాడో
సగం కప్పు కొబ్బరి తురుము లేదా పొడి
సగం చెంచా నిమ్మరసం
సగం చెంచా అల్లం రసం