Smartphones | బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకుంటున్నారా.. అవి ఇవే!
ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మొబైల్ కంపెనీలు కూడా అలాంటి మోడల్స్‌ను ఎక్కువగా లాంచ్ చేస్తున్నాయి. Samsung, Xiaomi, Realme లాంటి బ్రాండ్స్ రూ. 15,000 లోపు విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
స్మార్ట్ పోన్ల( smartphones) ప్రాధాన్యత పెరుగుతున్న వేళ చాలా మంది వినియోగదారులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రూ. 15 వేల ( smartphones below 15,000) లోపు ధరలో ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మొబైల్ కంపెనీలు కూడా అలాంటి మోడల్స్‌ను ఎక్కువగా లాంచ్ చేస్తున్నాయి, Samsung, Xiaomi, Realme రూ. 15,000 లోపు ధరలో స్మార్ట్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మరీ ఆ ఫోన్ల గురించి ఇప్పుడు చూద్దాం
మోడల్: Poco M3 Pro 5G
Poco M3 Pro 5G: 64GB స్టోరేజ్‌తో 4GB RAM కలిగిన ఈ ఫోన్ ధర రూ. 13,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 6GB RAMతో 128GB స్టోరేజ్ కలిగిన Poco M3 Pro 5G రూ. 15,999లకు లభిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్స్ దగ్గరకొస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 1,080X2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల పూర్తి-HD+ డాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 700 SoCతో ఆధారితమైనది . 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుండగా.. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8MPను కలిగి ఉంది.
మోడల్: Samsung Galaxy F22
Samsung Galaxy F22 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 12,499 ఉంది. 4GB RAM 64GB స్టోరేజ్‌ను కలిగిఉంది. అలాగే 6GB RAM.. 128GB స్టోరేజ్ ఆప్షన్ కలిగిన ఈ ఫోన్ రూ.14,499 ధరకు లభిస్తుంది. గెలాక్సీ F22 మాదిరి 90HZ రీఫ్రెష్ రేటుతో 6.4-అంగుళాల HD + AMOLED ఇన్ఫినిటీ-U డిస్ ప్లేను కలిగి ఉంది. octa-core MediaTek Helio G80 SoC ఇందులో అదనపు ఆకర్షణ. ఫోన్ ఆప్టిక్స్ విషయానికి వస్తే 48MP క్వాడ్-కెమెరా సెటప్, 13-మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వచ్చింది.
మోడల్: Realme Narzo 30
Realme Narzo 30 కొత్తగా లాంచ్ చేసిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇది 5G వేరియంట్. 4GB+64GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్‌కు రూ.12,499 ధర ఉండగా.. 6GB+128GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర వచ్చేసి రూ.14,499లుగా ఉంది. ఇది ఆక్టా-కోర్ CPUతో పాటు Mali G76 GPUతో MediaTek Helio G95 SoC పవర్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.5-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ 48MP ప్రైమరీ లెన్స్, 2MP మాక్రో షూటర్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్ ఇందులో పొందుపరిచారు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అంతేకాకుండా ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ అమర్చింది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. రేసింగ్ సిల్వర్, రేసింగ్ బ్లూ కలర్స్‌లో ఫోన్ లభిస్తుంది
మోడల్: Redmi 9 power
రెడ్‌మి 9 పవర్ ప్రస్తుత ధర రూ.11,499. ప్రస్తుత సేల్‌లో దీని ధర తగ్గవచ్చు. ఫోన్ ప్రత్యేకతలను చూస్తే ఇందులో 6.543 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్ దీని ప్రత్యేకత. ఇందులో టాప్ మోడల్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌తో దొరుకుతుంది. ఈ ఫోన్ రియర్ సైడులో 48 మెగాపిక్సెల్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.
మోడల్: Samsung Galaxy M32
శామ్‌సంగ్ గెలాక్సీ M32 వినియోగదారులను బాగా ఆకర్షించింది. దీని ధర రూ .14,999గా ఉంది. 6.4-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా వన్ UI ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మెరుగైన పనితీరు కోసం మీడియా టెక్ హీలియో జి 80 ప్రాసెసర్ అమర్చారు. 6 GB RAM , 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. పవర్ కోసం 6000mAh బ్యాటరీని ఉపయోగించారు.
సంబంధిత కథనం