Say No : నో చెప్పడం నేర్చుకో.. ప్రపంచంలో అతిపెద్ద జబ్బు No చెప్పకపోవడం
Say No Is Important : నో చెప్పకపోవడం ప్రపంచంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య. Yes చెప్పి ఇబ్బందులు పడే బదులు.. నో చెప్పి హాయిగా ఉండటం ఉత్తమం.
మనిషి జీవితంలో 'No' చెప్పడం ముఖ్యం, కానీ 'No' చెప్పడం ద్వారా మనం అపరాధభావంతో ఉంటాం. ఇదంతా పనికి రాని విషయం. నో చెబితేనే మీరు ఆనందంగా ఉంటారు. ఎస్ చెప్పి.. ఇరుక్కునే బదులుగా.. నో చెప్పడం నేర్చుకోవాలి. నో చెప్పకపోతే.. ఒకటి రెండు కాదు.. వందల సమస్యలు వస్తాయి.
ప్రతీ మనిషికి చాలా సందర్భాల్లో 'నో' చెప్పాల్సిన అవసరం వస్తుంది. కానీ చెప్పేందుకు ఇష్ట పడం. పక్కోడు చెప్పాడనో.. ఎదురింటి వాడు అడిగాడు అనో.. ఎస్ చెప్పేస్తాం. ఇక వారి పని కోసం.. చాలా కష్టాలు పడుతుంటాం. ఇదంతా అవసరమా బాసూ అని ఆలోచించాలి. వారి పని కోసం పొద్దంతా టైమ్ వేస్ట్ చేస్తాం. లేని పనిని మీద వేసుకుంటాం.
ఇలాంటి సందర్భాలు జీవితంలో చాలానే వస్తాయి. కానీ ఇతరులను సంతోషపెట్టే మన అలవాటు అనవసరంగా Yes అని చెప్పవలసి వస్తుంది. No అని చెప్పడం ద్వారా మనం అపరాధభావంతో ఉంటాం. కానీ జీవితంలో విజయం సాధించాలంటే.. ఒక దశకు చేరుకోవాలంటే 'నో' చెప్పాల్సిందే. ఇతరులు చేసే ప్రతి పనికి అవును అని చెప్పడం వల్ల మీ కోసం సమయం దొరకడం కష్టమవుతుంది. మీరు మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించలేరు. ఇతరులు మీ కంటే ముందున్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు నుండి మనం 'నో' చెప్పడం నేర్చుకోవాలి. ఎదుటివాళ్లను వాడుకోవాలనుకునేవారే.. పనులు చేయించుకుంటారు.
నో ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. మొదట వ్యక్తిగత జీవితంలోనూ, రెండోది వృత్తి జీవితంలోనూ రెండు రకాలుగా ఈ పరిస్థితి ఉంటుంది. నో చెప్పడానికి సిగ్గుపడే వ్యక్తులు నిజంగా భయపడతారని నిపుణులు అంటున్నారు. ఎవరికైనా నో చెబితే ఎదుటివారు ఏమనుకుంటారోనని భయపడతారు. వారు అసంతృప్తిగా ఉంటే.. బాధపడటం ప్రారంభిస్తాం. ఇదంతా ఆలోచిస్తూ తమ మనసును చంపుకొని చాలా మంది ఎస్ చెప్పేస్తారు.
వృత్తి జీవితంలో No చెప్పలేని వారు భయంతో మౌనంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఉద్యోగంలో భాగంగా.. ఎవరైనా ఏదైనా అడిగితే.. నో చెబితే భవిష్యత్తులో వారితో కలిసి పనిచేసే అవకాశం వస్తే తమ వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయని భయపడుతుంటారు. దీని కారణంగా మీరు పనిలో సమస్యలను ఎదుర్కోవచ్చు.
వ్యక్తిగత జీవితమైనా, వృత్తిపరమైన జీవితమైనా రెండు సందర్భాల్లోనూ No చెప్పగలిగిన వ్యక్తి తన సమయాన్ని తాను నిర్ణయించుకుంటారు. దీనివల్ల జీవితంలో మరింత విజయవంతమవుతారని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా పని చేయడం లేదా ఎవరితోనైనా మాట్లాడటం కష్టంగా అనిపించినప్పుడల్లా దీన్ని ప్రయత్నించండి. నో చెప్పడానికి సంకోచించకండి.
మీరు ప్రతీ విషయంలో ఎస్ చెబుతూ.. పోతే.. అవతలివారు మిమ్మల్ని వాడుకోవడం మెుదలుపెడతారు. అదే నో చెబితే టైమ్ వేస్ట్ పనులు మీరు చేయరని మీపై అభిప్రాయానికి వస్తారు. అందుకే అన్నింటికీ Yes చెప్పడం ఎందుకు దండగా.. No అనే పదం ఉండగ..