Sapodilla: సపోటా సీజన్ వచ్చేసింది, రోజుకో పండు తింటే చాలు, ఆ సమస్యలు దూరం
Sapodilla: చలికాలంలోనే సపోటా పండ్లు విరివిగా దొరుకుతాయి. రోజుకో పండు తింటే ఎన్నో అనారోగ్యాలు దూరంగా ఉంటాయి.
Sapodilla: చలికాలం వచ్చిందంటే సపోటా పూత పూసి, కాత మొదలు పెడుతుంది. సపోటా పండు సీజనల్ పండు, కాబట్టి కచ్చితంగా వీటిని కాలానగుణంగా తినాల్సిందే. దీనిలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన కాపర్, పొటాషియం, ఐరన్, ఫైబర్‌తో పాటు ఇంకెన్నో ఈ పండు ద్వారా మన శరీరానికి లభిస్తాయి. చలికాలంలో ప్రతిరోజు ఒక సపోట పండు తింటే చాలు, ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు.
రోజుకో సపోటా పండు తినడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. భవిష్యత్తులో కంటి చూపు తగ్గే అవకాశం ఉండదు. సపోటా పండులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ముఖంపై ముడతలు, గీతలు వంటివి రానివ్వవు. సపోటా పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో శరీరం పై దాడి చేసే వైరస్‌లు, బ్యాక్టీరియా నుండి ఇది రక్షణ కల్పిస్తుంది.
రాత్రిపూట నిద్రలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ. అలాంటివారు ప్రతిరోజూ ఒక సపోటా పండును తినడం అలవాటు చేసుకుంటే మంచిది. దీనిలో విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి, ఫోలేట్, ఫాస్పరస్ వంటివన్నీ లభిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికం. జీర్ణ సమస్యలను ఇది దూరం చేస్తుంది. అలాగే లైంగికంగా ఇది ఎంతో మేలు చేస్తుంది. సంతానం లేని వారికి సపోటా పండు తినడం వల్ల మేలు జరుగుతుంది. ఇది టెస్టోస్టిరాన్ హార్మోన్ చక్కగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ సపోటా పండును తినడం వల్ల ఫలితం ఉంటుంది. అధిక బరువును తగ్గించుకోవాలనుకునేవారు, చలికాలంలో ప్రతిరోజు సపోటాను తినడం అలవాటు చేసుకోవాలి. తరచూ అలసట, నీరసం బారిన పడుతున్న వారు సపోటాను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మం కాంతివంతంగా మారాలనుకుంటే సపోటాను మీ ఆహారంలో భాగం చేసుకోండి.