పడిపోయిన Samsung Galaxy A22 5G స్మార్ట్‌ఫోన్ ధర.. ఇప్పుడు ఎంతో తెలుసా?
శాంసంగ్ కంపెనీ వరుసగా తమ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై ధరలను తగ్గిస్తోంది. తాజాగా Samsung Galaxy A22 స్మార్ట్‌ఫోన్ ధరను కూడా తగ్గించింది. ఇప్పుడు కొత్త ధర ఎంత, ఫీచర్లు, ఇతర వివరాలను తెలుసుకోండి.
దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ తమ ప్రొడక్ట్స్ ధరలను ఎప్పటికప్పుడు తగ్గిస్తూ వస్తోంది. ఇటీవలే శాంసంగ్ కంపెనీ Galaxy Watch 4 స్మార్ట్‌వాచ్ అలాగే Galaxy A13, Galaxy F23 5G స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. ఇప్పుడు మరో 5G స్మార్ట్‌ఫోన్ - Galaxy A22 ధరను మరింత తగ్గించింది. అందుబాటు ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ ఫోన్ ఇప్పుడు ఉత్తమ ఛాయిస్ అవుతుంది.
Samsung Galaxy A22 5G కొన్ని నెలల కిందట భారత మార్కెట్లో విడుదలైంది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు వేరియంట్లపై రూ.2,000 తగ్గింపు ధరను ప్రకటించింది. ఈ క్రమంలో
Samsung Galaxy A22 5G బేస్ వేరియంట్ అయిన 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర పాత ధర రూ. 19,999/- ఉండగా ఇప్పుడు ఇది రూ. 17,999/- కే లభిస్తుంది. అలాగే హై-ఎండ్ వేరియంట్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ పాత ధర రూ. 21,999/- కాగా, ఇప్పుడు తగ్గింపుతో రూ. 19,999/- కే లభిస్తుంది. అంటే రూ. 20 వేల లోపు లభించే 5G కేటగిరీ స్మార్ట్‌ఫోన్ల జాబితాలోకి చేరాయి.
Samsung Galaxy A22 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
- 6GB/8GB ర్యామ్, 128+ GB ఇంటర్నల్ స్టోరేజ్
- ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్
- వెనకవైపు 48MP+5MP+2MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 15W ఫాస్ట్ ఛార్జర్
Samsung Galaxy A22లో ఇంకా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ , కనెక్టివిటీ కోసం5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి తదితర ఫీచర్లు ఉన్నాయి.
సంబంధిత కథనం