Dark Neck: మెడ భాగంలో నల్లగా ఉందా ? అయితే ఇలా సులభంగా తొలగించుకోండి!
మనలో చాలామందికి మెడ, మోకాళ్ల ప్రాంతాల్లో నల్లగా ఉండడం చూసి ఉంటాం. ముఖ్యంగా మెడపై ఏర్పడే నలుపు కారణంగా చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు ఉపయోగించడం ద్వారా మెడపై ఏర్పడిన నలుపును సులభంగా తొలగించుకోవచ్చు
Dark Neck
చెమట, కాలుష్యం ప్రభావం కారణంగా ముఖం, మెడ నల్లగా మారుతుంటాయి. ముఖ్యంగా మహిళలు మెడలపై డార్క్‌ను ఎక్కువగా చూస్తుంటాం. వాటిని పోగొట్టుకునేందుకు బ్యూటీపార్లర్‌లో స్క్రబ్బింగ్, క్లెన్సింగ్, మసాజ్, ఫేషియల్ వంటి చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. అయితే మెడ నల్లగా ఉండటానికి అంతర్గత ఆరోగ్యమే ముఖ్య కారణమని నిపుణులు అంటున్నారు. స్థూలకాయం, జన్యుపరమైన కారణాలు, ఇన్సులిన్ నిరోధకత, మహిళల్లో PCOS, మధుమేహం, హైపోథైరాయిడ్, చర్మ అలెర్జీలు వంటి అనేక ఆరోగ్య కారణాల వల్ల మెడ నల్లగా మారుతుందని చెబుతున్నారు.
ఈ సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, ముందుగా దానికి కారణాన్ని తెలుసుకోండి. కారణాన్ని తెలుసుకోవడం ద్వారా సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు. కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి డార్క్ నెక్‌ను ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- చర్మంపై నల్లదనాన్ని ఉండడానికి బరువు ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఎత్తు, బరువు అధారంగా బాడీ మాస్ ఇండెక్స్ చూసుకుని వెయిట్‌ను మెుయిన్‌టైన్ చేయండి.
- మెడను శుభ్రంగా ఉంచుకోండి, అప్పుడే డార్క్ నెక్ తొలగిపోతుంది. మెడను శుభ్రం చేయడానికి, సబ్బుతో మెడను తరుచుగా కడుగుతుండాలి. కొన్ని సహజ నివారణలను కూడా ఉపయోగించవచ్చు.
- చర్మాన్ని శుభ్రపరిచే ప్రక్రియలో చర్మాన్ని ఎక్కువగా ఎక్స్‌ఫోలియేట్ చేయవద్దు, అలా చేస్తే చర్మం బయటకు రావడం ప్రారంభమవుతుంది.
- హార్మోన్ పరీక్ష చేయించుకోండి. హార్మోన్ల హెచ్చుతగ్గులు సమస్యలను కలిగిస్తాయి.
- లాక్టిక్ యాసిడ్ బేస్ క్రీమ్ ఉపయోగించండి, ఇలా చేయడం వల్ల డార్క్ నెక్ తగ్గుతుంది.
- చర్మంపై సుగంధ ద్రవ్యాలు, రసాయన ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి.
- మెడపై సన్‌స్క్రీన్ అప్లై చేసేలా చూసుకోండి. సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని సూర్యుడి నుండి, హానికరమైన కిరణాల నుండి కాపాడుతుంది.
- చర్మాన్ని గట్టిగా రుద్దకండి, ఈ చిట్కాలన్నింటినీ ఉపయోగించడం ద్వారా నల్లటి మెడను వదిలించుకోవచ్చు.
సంబంధిత కథనం