Realme Q5x । అతి తక్కువ ధరకే రియల్‌మి నుంచి 5G స్మార్ట్‌ఫోన్‌!-realme q5x smartphone which is similar to realme v20 5g launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Realme Q5x । అతి తక్కువ ధరకే రియల్‌మి నుంచి 5g స్మార్ట్‌ఫోన్‌!

Realme Q5x । అతి తక్కువ ధరకే రియల్‌మి నుంచి 5G స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Jun 20, 2022 11:59 AM IST

రియల్‌మి కంపెనీ తాజాగా Realme Q5x స్మార్ట్‌ఫోన్‌ పేరుతో మరొక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 5G కేటగిరీలో ఇది చాలా చవకైన స్మార్ట్‌ఫోన్‌. మరి దీని ధర ఎంత, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

<p>Realme Q5x</p>
Realme Q5x

మొబైల్ తయారీదారు Realme తమ Q5-సిరీస్‌కి మరో హ్యాండ్‌సెట్‌ని జతచేసింది. Realme Q5x పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను తమ హోం మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ Q5 సిరీస్‌లో నాల్గవది అంతేకాకుండా ఎంతో సరసమైనది.

ఇది ఎంట్రీ-లెవల్ ఫోన్ అయినప్పటికీ 5G మోడెమ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ లో దృఢమైన బ్యాటరీ సెల్‌తో పాటు, డ్యూయల్-లెన్స్ కెమెరా, ఆకట్టుకునే 88.7% స్క్రీన్-టు-బాడీ రేషియోలో HD+ LCD స్క్రీన్ కలిగింది. నూతన ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.

Realme Q5x ఒకే వేరియంట్ లో విడుదలైంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Realme Q5x 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.5-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే

4 GB RAM, 64 GB స్టోరేజ్ సామర్థ్యం

ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్

వెనకవైపు 13 MP+ 0.3MP కెమెరా సెట్ , ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10 W ఫాస్ట్ ఛార్జర్

ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే కనెక్టివిటీ కోసం డ్యూయల్-సిమ్ కార్డ్ సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్, 5G, GPS , USB-C పోర్ట్‌ అలాగే 3.5mm ఆడియో జాక్‌ తదితర స్పెసిఫికేషన్లు ఉన్నాయి. 

Realme Q5x 5G క్లౌడ్ బ్లాక్, స్టార్ బ్లూ అనే రెండు కలర్ ఛాయిస్‌లలో లభిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో విడుదల చేసింది. అక్కడి ధరను మన భారతీయ కరెన్సీతో పోల్చితే సుమారు రూ. 11,500/- ఈ ఫోన్ ధర ఉంది. 

విచిత్రం ఏమిటంటే రియల్‌మి కంపెనీ ఇటీవలే Realme V20 5G పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసేంది. ఇప్పుడు Realme Q5x 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లకు పేర్లు వేరైనా మొత్తం ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అలాగే లభ్యమయ్యే కలర్ ఛాయిస్‌లు ఒకేలా ఉండటం గమనార్హం.

Whats_app_banner

సంబంధిత కథనం