దృఢమైన బ్యాటరీతో Realme Pad Mini టాబ్లెట్ ఆవిష్కరణ!-realme pad mini unveiled ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  దృఢమైన బ్యాటరీతో Realme Pad Mini టాబ్లెట్ ఆవిష్కరణ!

దృఢమైన బ్యాటరీతో Realme Pad Mini టాబ్లెట్ ఆవిష్కరణ!

HT Telugu Desk HT Telugu
Apr 05, 2022 04:17 PM IST

రియల్‌మి నుంచి మరో టాబ్లెట్ ఫోన్ విడుదలయింది. Realme Pad Mini పేరుతో వస్తున్న ఈ టాబ్లెట్లో మంచి బ్యాటరీ బ్యాకప్ తో పాటు స్క్రీన్ రెసల్యూషన్ అలాగే స్పీకర్లు బాగున్నాయి. మిగతా వివరాలు ఇలా ఉన్నాయి..

<p>Realme Pad Mini</p>
Realme Pad Mini

కొన్ని వారాలుగా వస్తున్న ఊహగానాలను నిజం చేస్తూ Realme ఎట్టకేలకు Realme Pad Miniని ఆవిష్కరించింది. ఈ టాబ్లెట్ గతంలో వచ్చిన రియల్‌మి ప్యాడ్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్. స్మార్ట్‌ఫోన్ పరిమాణాన్ని మరింత పెంచుతూ, ల్యాట్‌టాప్‌ల కంటే తక్కువ పరిమాణంలో మధ్యస్థంగా ఉండే ఈ టాబ్లెట్లు అధికార కార్యకలాపాలకు, విద్యార్థులకు e- లర్నింగ్ కోసం అనువుగా ఉంటాయి. 

ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో లాంచ్ చేసిన ఈ టాబ్లెట్ త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో Realme Pad Miniకి సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? ధరలు ఏ మేరకు ఉండొచ్చో ఇక్కడ చూడండి.

Realme Pad Mini టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

8.7-అంగుళాల LCD డిస్‌ప్లే, 1340×800 పిక్సెల్స్ రిజల్యూషన్‌

3GB/4GB RAM, 64 GB స్టోరేజ్ సామర్థ్యం 

Unisoc T616 ప్రాసెసర్

వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

6400mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జింగ్

ధర రూ. 14 వేల నుంచి రూ.18 వేల వరకు

మిగతా స్పెక్స్ చూస్తే.. కనెక్టివిటీలో Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, 4G సపోర్ట్, USB-C పోర్ట్ , 3.5mm ఆడియో కాంబో జాక్ సహా డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. గ్రే, బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం