రూ. 5 వేల ప్రారంభోత్సవ డిస్కౌంట్‌తో Realme GT 2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల-realme gt 2 pro 5g smartphone launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Realme Gt 2 Pro 5g Smartphone Launched

రూ. 5 వేల ప్రారంభోత్సవ డిస్కౌంట్‌తో Realme GT 2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల

HT Telugu Desk HT Telugu
Apr 07, 2022 04:30 PM IST

Realme కంపెనీ తాజాగా Realme GT 2 Pro పేరుతో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..

Realme GT 2 Pro 5G
Realme GT 2 Pro 5G (Realme India)

Realme కంపెనీ తాజాగా నిర్వహించిన ఓ లైవ్ ఈవెంట్‌లో భాగంగా తమ బ్రాండ్ నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ Realme GT 2 Pro 5Gను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇదే ఈవెంట్‌లో Realme 9 స్మార్ట్‌ఫోన్, Realme Buds Air 3, Realme Book Prime, Realme Smart TV స్టిక్‌లను కూడా కంపెనీ ఆవిష్కరించింది.

ఈ సరికొత్త Realme GT 2 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల పరంగా చూస్తే మీడియం రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ లతో పోటీపడుతుంది.

బయో-బేస్డ్ పాలిమర్ డిజైన్‌తో GT2 ప్రోను తయారు చేయడానికి Realme కంపెనీ Naoto Fukusawaతో కలిసి పనిచేసింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ నాణ్యమైన పిక్చర్ క్వాలిటీని అందించే LTPO 2.0 టెక్నాలజీతో 2K AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత? మొదలగు వివరాలు ఇక్కడ చూడండి.

Realme GT 2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల 2K AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే  

8/12 GB RAM, 128/256 GB స్టోరేజ్ సామర్థ్యం 

స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్

వెనకవైపు 50MP సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ షూటర్, ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 65W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ

8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర. రూ.49,999/- కాగా, 12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర. రూ.52,999/- గా  నిర్ణయించారు.

ఇంకా స్మార్ట్‌ఫోన్‌లో కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

ఇక.. పేపర్ వైట్, పేపర్ గ్రీన్, స్టీల్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభించే ఈ ఫోన్ ఏప్రిల్ 14 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా రూ. 5 వేలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్