రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. లగేజ్ విషయంలో రైల్వేశాఖ అడ్వైజరీ!
ఇక రైల్వేలో నిర్ణీత పరిమితికి మించి ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణీకులు ఎంత లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చో రైల్వే శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
విమాన ప్రయాణంలో ఉన్న లగేజీ నిబంధనలాగే రైల్వేలో కూడా రూల్స్ తీసుకువచ్చారు. ఒకవేళ పరిమితికి మించి బ్యాగేజీని తీసుకువెళితే మాత్రం ప్రయాణీకులు అదనంగా టిక్కెట్ రుసుము చెల్లించాలి. రైలులో ప్రయాణించేటప్పుడు లగేజీ నియమాలు వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు నిర్ణీత పరిమితికి మించి ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణంలో ప్రయాణీకుడు తనతో ఎంత లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చో తెలుసుకుందాం.
ఇంతకు మించి లగేజ్ తీసుకెళ్లితే రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఏసీ ఫస్ట్‌క్లాస్ టిక్కెట్లు ఉన్న రైలు ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. AC రెండవ తరగతిలో ప్రయాణించేవారు, 50 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు.అదే సమయంలో, ఏసీ థర్డ్ క్లాస్‌లో టికెట్ ఉన్న ప్రయాణికులు 40 కిలోల లగేజీతో ఉచితంగా ప్రయాణించవచ్చు. సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోల లగేజీని తీసుకెళ్లవచ్చు.
అదనంగా, ప్రయాణీకులు 100 సెం.మీ × 60 సెం.మీ × 25 సెం.మీ (పొడవు × మందం × ఎత్తు) లగేజీని తమతో పాటు ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లో తీసుకెళ్లవచ్చు.ఈ కొలతకు మించిన బ్యాగేజీ ఉంటే ప్రయాణికులు బ్రేక్ వ్యాన్‌లను బుక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రయాణికులు నిర్ణీత బరువు కంటే ఎక్కువ తీసుకుని వెళితే బ్యాగేజీ కౌంటర్‌లో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.అలా చేయని పక్షంలో ప్రయాణికులు 6 రెట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం