Tender Coconut Payasam : స్టవ్ వెలిగించకుండా కొబ్బరి పాయసం చేసేయండి.. సింపుల్‌గా-prepare payasam with tender coconut without using gas stove ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tender Coconut Payasam : స్టవ్ వెలిగించకుండా కొబ్బరి పాయసం చేసేయండి.. సింపుల్‌గా

Tender Coconut Payasam : స్టవ్ వెలిగించకుండా కొబ్బరి పాయసం చేసేయండి.. సింపుల్‌గా

Anand Sai HT Telugu
Jan 07, 2024 03:40 PM IST

Tender Coconut Payasam In Telugu : కొబ్బరి ఆరోగ్యానికి మంచిది. అయితే దీనితో పాయసం చేయండి. స్టవ్ కూడా వెలిగించాల్సిన అవసరం లేదు.

కొబ్బరి పాయసం తయారీ విధానం
కొబ్బరి పాయసం తయారీ విధానం

పాయసం అంటే లొట్టలేసుకుంటూ తింటారు. ఇందులోనూ రకరకాలుగా చేసుకోవచ్చు. లేత కొబ్బరితో చేసే పాయసం సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనిని ఎక్కువగా దేవుడికి ప్రసాదం పెట్టేందుకు చేస్తుంటారు. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. లేత కొబ్బరితో చేసే పాయసం రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది.

లేత కొబ్బరి పాయసం చేసేందుకు టైమ్ కూడా ఎక్కువగా తీసుకోదు. చాలా ఈజీగా చేసేయెుచ్చు. సాధారణ పాయసం చేసినట్టుగా గంటలు గంటలు స్టవ్ వెలిగించి మరిగించాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడు దీనిని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి కొబ్బరి పాయసం తింటే మళ్లీ మళ్లీ తినాలి అనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం చలికాలం నడుస్తుంది. తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. లేత కొబ్బరి పాయసాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం..

నిజానికి పాయసం అనే పేరు చెప్పగానే నోట్లో నీరు వస్తుంది. దీన్ని ఇష్టపడని వారు ఉండరేమో. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీట్లలో ఒకటి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెళ్లిళ్లు, పండగల్లో పాయసం తప్పనిసరి. సాధారణంగా పాయసాల్లో చాలా రకాలు ఉంటాయి. అవి పాలతో చేసే పాయసం, సేమియా పాయసం, దాల్ పాయసం మొదలైనవి.

కానీ మీరు ఎప్పుడైనా కొబ్బరి నీటితో చేసిన పాయసం ప్రయత్నించారా? లేత కొబ్బరితో చేసే పాయసం కొత్త రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కొబ్బరి నీరు కల్తీ కావు కాబట్టి మనం తయారు చేసుకుని తినవచ్చు. ఈ పాయసం చేయడానికి పొయ్యి అంటించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం..

కొబ్బరి పాయసం తయారీ విధానం

కొబ్బరి నీరు - 1 కప్పు

లేత కొబ్బరి గుజ్జు - 4 టేబుల్ స్పూన్లు

పాలు - 2-3 టేబుల్ స్పూన్లు

కొబ్బరి పాలు - 1/4 కప్పు

జీడిపప్పు - 6

కిస్ మిస్ - 4

ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు పోయండి. తర్వాత కొబ్బరికాయను మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. దీన్ని ఆ నీటిలో వేసి బాగా కలపాలి. దీనికి పాలు, కొబ్బరి పాలు జోడించండి. మీకు కావాలంటే వేయించిన జీడిపప్పు వేయవచ్చు. కిస్ మిస్ కూడా జోడించొచ్చు. కావాలంటే కాస్త చక్కెర వేసుకోండి. తర్వాత ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే రుచికరమైన లేత కొబ్బరి పాయసం రెడీ.

Whats_app_banner