Double Hair Whorls : తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా?-myths and scientific reasons behind double whorl in head ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Double Hair Whorls : తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా?

Double Hair Whorls : తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా?

Anand Sai HT Telugu
Dec 09, 2023 04:30 PM IST

Double Hair Whorls Meaning : తలలో రెండు సుడులు ఉంటే చాలా మంది ఆటపట్టిస్తారు. రెండు పెళ్లిళ్లు అవుతాయని చెబుతారు. ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటారు. కానీ ఇది నిజమేనా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తలలో రెండు సుడులు ఉంటే ఆటపట్టించడం సర్వసాధారణం. మగవాళ్లు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని అంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నిజమేనా? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ చూద్దాం.

సాధారణంగా కొంతమందికి మాత్రమే తలలో రెండు సుడులు ఉంటాయి. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మందికి మాత్రమే రెండు సుడులు ఉన్నాయని ఒక అధ్యయనం తెలిపింది. నిజానికి ఎవరికైనా తలపై రెండు సుడులు ఉంటే అది జన్యుసంబంధమైనది. వారి పూర్వీకులకు ఇలా ఉంటే కూడా వస్తుందట.

అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తలలో రెండు సుడులు ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని చెబుతారు. అయితే ఇది నిజం అని ఇప్పటి వరకు రుజువు కాలేదు. కేవలం నమ్మకాల మీదనే ఇది ఉంది. అయితే ఇలా రెండు సుడులు ఉన్నవారికి కొన్ని మంచి గుణాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వారు సహనం, ప్రేమ, సహాయం వంటి లక్షణాలను కలిగి ఉంటారు.

ఇలా డబుల్ ట్విస్టెడ్ హెయిర్ ఉండటం అనేది ప్రధానంగా జన్యువుల కారణంగానే జరుగుతుంది. దీనికి చింతించాల్సిన అవసరం లేదు. పురుషులు, మహిళకు ఇది వారి వారసత్వం నుంచి పొందుతారట. రెండు సుడులు ఉన్నవారిని చూడటం అరుదు. ఇలా ఉంటే రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది మాత్రం నిజం కాదు. ఇది కేవలం శరీర లక్షణం మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

చాలా ప్రాంతాల్లో రెండు సుడులు ఉంటే.. రెండుసార్లు పెళ్లి చేసుకుంటారని నమ్ముతారు. లేదంటే పెళ్లి ముహూర్తం కుదిరిన తర్వాత కూడా పెళ్లి బంధం తెగిపోయి.. రెండో పెళ్లికి సిద్ధమవుతారని ఓ ప్రచారం ఉంది. ఇది ఇది కచ్చితం అని చెప్పలేం. శాస్త్రం ప్రకారం మాత్రం రెండు సుడులు ఉంటే మంచివారని అంటారు. సూటిగా ఏదైనా విషయాన్ని మాట్లాడుతారని, ఓపికగా ఉంటారని, అందరితో కలిపోతారని చెబుతారు. ఇలా తలలో రెండు సుడులు ఉన్నవారు వందసార్లు ఆలోచిస్తారట. చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తారు. రెండు పెళ్లిళ్లు అవుతాయనే మాట మాత్రం నిజం కాదు.

Whats_app_banner