Neer Dosa Recipe : నీర్ దోశ ఎప్పుడైనా తిన్నారా? కొబ్బరి చట్నీలోకి అదిరిపోతుంది
Neer Dosa Recipe Telugu : నీర్ దోశ గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ దక్షిణ కర్ణాటక జిల్లాలో ఇది ఫేమస్. ఎక్కువ మంది చాలా ఇష్టంగా తింటారు. తయారు చేయడం కూడా ఈజీనే.
దోశలో చాలా రకాలు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగానూ ఉంటాయి. దోశలను బ్రేక్ ఫాస్ట్ లోకి ఇష్టంగా చాలా మంది తింటారు. అయితే ఎప్పుడూ ఒకేలా దోశను తినేవారు అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయండి. పక్క రాష్ట్రాల్లో చేసుకునే విధానాలను ఫాలో అయిపోండి. అందులో భాగంగా నీర్ దోశ తయారు చేయండి. కొబ్బరి చట్నీలోకి బాగుంటుంది. సులభంగానే తయారు చేయెుచ్చు.
నీర్ దోశను మంగళూరులో చాలా ఇష్టంగా తింటారు. చాలా పలుచగా ఈ దోశ ఉంటుంది. ఈ దోశతో మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది వెజ్‌లోకి సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. ఫిష్ కర్రీలోకి కూడా బాగుంటుంది. తయారు చేసేందుకు పెద్దగా పదార్థాలు కూడా అవసరం లేదు. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం..
నీర్ దోశకు కావాల్సిన పదార్థాలు : రైస్, నీరు, సాల్ట్ రుచికి సరిపడా
మెుదట 2 కప్పుల బియ్యాన్ని 6-7 గంటలు నానబెట్టండి. మీరు ఉదయం చేయాలని అనుకుంటే రాత్రి నానపెట్టుకోవచ్చు. తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. ఎంత మెత్తగా రుబ్బుకుంటే దోసె అంత బాగుంటుంది. తరవాత అందులో నీళ్లు పోయాలి. ఉప్పు కాస్త కలుపుకోవాలి. సాధారణ దోశలో పిండి పోసినట్టుగా చిక్కగా ఉండకూడదు.
ఇప్పుడు ఒక పాన్ తీసుకుని కాస్త నూనె దాని మీద రాసుకోవాలి. తర్వాత దోశ పిండిని పోయాలి. అయితే సాధారణ దోశలాగా ఎక్కువగా పిండిని పోయకూడదు. సన్నగా దోశ పిండి వేయాలి. తర్వాత దానిని అటు ఇటు అనుకోవాలి. ఇక మరో పాత్రతో కప్పాలి. దోశ ఉడికిన తర్వాత తీయాలి. సాధారణ దోశను మాడ్చినట్టుగా నీర్ దోశను మాడ్చకూడదు. కేవలం ఉడికితే సరిపోతుంది. ఈ నీర్ దోశ కొబ్బరి చట్నీలోకి చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ దోశ వేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. దోశ పిండిలో మరీ ఎక్కువగా నీరు పోయకూడదు. ఎక్కువ నీళ్లు పోసినా దోశ అంటుకుంటుంది. తక్కువ నీరు పోసినా బాగుండదు. చూసుకుని పోయాలి. పాన్ బాగా వేడెక్కకముందే దోశ పిండి వేస్తే దోశ అంటుకుంటుంది. నీళ్లు ఎక్కువగా ఉంటే బియ్యప్పిండి వేసుకోవచ్చు. వేడి ఎక్కువైతే దోశ అడుగు భాగం నల్లగా మారుతుంది. అందుకే ఓ పద్ధతి ప్రకారం చేయాలి. టైమింగ్ చాలా అవసరం.