Potato pulao: బిర్యానీ బోర్ కొడితే.. ఒకసారి ఈ ఆలూ పులావ్ ట్రై చేయండి..-potato rice or pulao recipe process in detailed steps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Pulao: బిర్యానీ బోర్ కొడితే.. ఒకసారి ఈ ఆలూ పులావ్ ట్రై చేయండి..

Potato pulao: బిర్యానీ బోర్ కొడితే.. ఒకసారి ఈ ఆలూ పులావ్ ట్రై చేయండి..

HT Telugu Desk HT Telugu
Jul 03, 2023 11:44 AM IST

Potato pulao: బంగాళదుంపతో చేసే రుచికరమైన పులావ్ ఎలా తయారు చేసుకోవాలో వివరమైన స్టెప్స్, కొలతలో చూసేయండి.

బంగాళదుంప పులావ్
బంగాళదుంప పులావ్ (freepik)

తరచూ బిర్యానీ తినడం బోర్ కొడితే ఒకసారి ఎక్కువ కూరగాయలు అవసరం లేకుండా చేసుకోగలిగే ఆలూ పులావ్ ప్రయత్నించి చూడండి. చాలా సింపుల్‌గా తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు బాస్మతీ బియ్యం

ఒకటిన్నర కప్పు నీళ్లు

3 పెద్ద బంగాళదుంపలు

2 చెంచాల నూనె

1 బిర్యానీ ఆకు

2 యాలకులు

2 లవంగాలు

1 చిన్న దాల్చిన చెక్క ముక్క

పావు టీస్పూన్ ఆవాలు

1 పెద్ద ఉల్లిపాయ

కొద్దిగా కరివేపాకు

పావు టీస్పూన్ పసుపు

తగినంత ఉప్పు

కొద్దిగా కొత్తిమీర తరుగు

1 పెద్ద టమాటా

2 వెల్లుల్లి రెబ్బలు

1 చెంచా అల్లం తరుగు

2 పచ్చిమిర్చి తరుగు

పావు టీస్పూన్ జీలకర్ర

తయారీ విధానం:

  1. కప్పు బాస్మతీ బియ్యాన్ని నీళ్లతో కడిగేసి అరగంట పాటూ నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడొక మిక్సీలో టమాటా ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసి నీళ్లు లేకుండా మిక్సీ పట్టుకోవాలి. టమాటాలో ఉన్న నీళ్లతోనే ముద్దలాగా అయిపోతుంది.
  3. ఇప్పుడొక ప్రెజర్ కుక్కర్ లో రెండు చెంచాల నూనె తీసుకోవాలి. సన్నని మంట మీద బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి.
  4. ఆవాలు కూడా వేసుకుని కాస్త చిటపటలాడాక, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాస్త రంగు మారాక కరివేపాకు కూడా వేసుకోవాలి.
  5. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకుని వేగనివ్వాలి. పసుపు కూడా వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కాస్త పెద్దగా తరిగిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి.
  6. మసాలా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి.
  7. రెండు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్‌లో ఉడికించుకోవాలి.చివరగా కొత్తిమీర, పుదీనా ఆకులను చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.

Whats_app_banner