Poha Payasam Recipe : అటుకుల పాయసం.. ఇది బెల్లంతో తయారు చేసే రెసిపీ-poha payasam recipe for occasions and here is the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poha Payasam Recipe : అటుకుల పాయసం.. ఇది బెల్లంతో తయారు చేసే రెసిపీ

Poha Payasam Recipe : అటుకుల పాయసం.. ఇది బెల్లంతో తయారు చేసే రెసిపీ

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 20, 2023 06:00 AM IST

Poha Payasam Recipe : పాయసం అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే కొందరు చక్కెరతో చేస్తే అంతగా తినరు. అయితే బెల్లంతో చేసే అటుకుల పాయసం గురించి మీకు తెలుసా? దీనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

బెల్లంతో అటుకుల పాయసం
బెల్లంతో అటుకుల పాయసం

Poha Payasam Recipe : చాలా మంది అటుకులతో వివిధ రకాల పోహాలను తయారు చేసుకుంటారు. అయితే మీరు అటుకులతో తియ్యని వేడుక చేసుకోవాలి అనుకుంటే మీరు బెల్లంతో చేసుకోగలిగే అటుకుల పాయసం చేసుకోవచ్చు. ఇది టేస్టీ, హెల్తీ, సింపుల్ రెసిపీ. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పాలు - 500 మిల్లీలీటర్లు

* పోహా - 1 కప్పు

* బెల్లం - రుచి ప్రకారం

* బాదం - 1 టేబుల్ స్పూన్ (తరిగిన)

* జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్ (తరిగిన)

* ఎండుద్రాక్ష - 1 టేబుల్ స్పూన్ (తరిగిన)

* యాలకులు - 2

* బే ఆకు - 1

బెల్లంతో అటుకుల పాయసం తయారీ విధానం

పోహాను నీటిలో ఒకటి లేదా రెండు నిమిషాలు నానబెట్టి.. అదనపు నీటిని బయటకు తీయండి. దానిని కాసేపు పక్కనే ఉంచండి. ఇప్పుడు యాలకులు, బే ఆకుతో పాలను మరిగించండి. దానిలో నానబెట్టిన పోహాను వేసి బాగా కలిపి ఉడికించండి. అది బాగా స్థిరత్వం వచ్చినప్పుడు.. మంటను తగ్గించి, బెల్లం లేదా పంచదార వేసి కలపాలి. డ్రైఫ్రూట్స్, నట్స్​తో గార్నీష్ చేయండి. దీనిని మీరు వేడిగా తినొచ్చు. కానీ చల్లగా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం