Pepper Fish Fry: పెప్పర్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే చిన్న ముక్క కూడా మిగలదు, చూస్తేనే నోరూరిపోతుంది-pepper fish fry recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pepper Fish Fry: పెప్పర్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే చిన్న ముక్క కూడా మిగలదు, చూస్తేనే నోరూరిపోతుంది

Pepper Fish Fry: పెప్పర్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే చిన్న ముక్క కూడా మిగలదు, చూస్తేనే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu
May 12, 2024 11:30 AM IST

Pepper Fish Fry: చేపల వేపుడు పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. కాస్త భిన్నంగా మిరియాల పొడితో చేపల వేపుడు చేసి చూడండి. అందరికీ నచ్చడం ఖాయం. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

మిరియాల చేపల వేపుడు
మిరియాల చేపల వేపుడు

Pepper Fish Fry: మాంసాహారుల్లో ఎంతోమందికి చేపల వేపుడు అంటే ప్రాణం. కానీ దీన్ని రుచిగా చేయడం వచ్చిన వారు తక్కువమందే. చేపల వేపుడు మిరియాల పొడితో చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెప్పర్ ఫిష్ ఫ్రై ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

పెప్పర్ ఫిష్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చేప ముక్కలు - ఆరు

మిరియాలు పొడి - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

నూనె - సరిపడినంత

ఉప్పు - రుచికి సరిపడా

వెల్లుల్లి - పది రెబ్బలు

కారం - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

పసుపు - ఒక స్పూను

పెప్పర్ ఫిష్ ఫ్రై రెసిపీ

1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి.

3. మిరియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

4. వెల్లుల్లి రెబ్బలను మెత్తని పేస్టులా చేసి అవి కూడా వేసి బాగా కలపాలి.

5. ఒక స్పూను నూనె కూడా అందులో వేయాలి.

6. ఇప్పుడు మసాలా ముద్ద రెడీ అయినట్టే.

7. ఈ మసాలా ముద్దను చేప ముక్కలకు బాగా పట్టించాలి.

8. ఒక అరగంట సేపు వాటిని పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి.

9. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టాలి. కాస్త లోతుగా ఉండే పెనం తీసుకుంటే మంచిది.

10. అందులో రెండు స్పూన్ల నూనె వేయాలి.

11. ఆ నూనె వేడెక్కాక ఈ చేప ముక్కలను పెనంపై పెట్టాలి.

12. చిన్న మంట మీద ఈ చేపలను ఫ్రై చేయాలి.

13. ఒక పది నిమిషాలు తర్వాత రెండో వైపుకు చేప ముక్కలను తిప్పాలి.

14. రెండు వైపులా చేప ముక్కలు ఎర్రగా వేగాక పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ కట్టేయాలి.

15. అంతే స్పైసీ పెప్పర్ ఫిష్ ఫ్రై రెడీ అయినట్లే. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది.

పెప్పర్ ఫిష్ ఫ్రై ని స్నాక్స్ లా తినేయొచ్చు. బిర్యానీ లేదా సాంబార్ కి జతగా కూడా తినవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇందులో వాడిన మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపలు ఎన్ని తిన్నా కూడా బరువు పెరగరు. కాబట్టి ఇష్టంగా తినవచ్చు. వీటి రుచి కూడా అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ మీరే ఈ పెప్పర్ ఫిష్ ఫ్రై రెసిపీని ప్రయత్నిస్తారు.

Whats_app_banner