Papaya Myth Vs Fact : బొప్పాయి తింటే వారంలో 2 కిలోల బరువు తగ్గుతారా?
Papaya For Weight Loss : బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ పండు చుట్టు చాలా రకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో కొంతమంది తినేందుకు భయపడతారు. అందులో నిజమేంత?
బొప్పాయి వారంలో రెండు కిలోల బరువు తగ్గడానికి సహాయపడుతుందా? బరువు తగ్గాలనుకునే(Weight Loss) వారు, ఫిట్‌గా ఉండాలనుకునే వ్యక్తులు చాలా వ్యాయామాలు, ఆహారాన్ని అనుసరిస్తారు. అటువంటి పరిస్థితిలో కొవ్వును తొలగించడంలో లేదా బరువు తగ్గించడంలో సహాయపడే ప్రతిదాన్ని చేస్తారు. బరువు తగ్గడం గురించి ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి. బొప్పాయి తినడం వల్ల బరువు తగ్గుతుందనేది(Papaya For Weight loss) ప్రచారంలో ఉంది. బొప్పాయి తినడం వల్ల నిజంగా బరువు తగ్గుతుందా లేదా అనేది చూద్దాం.
బొప్పాయి భారతీయ మార్కెట్లలో సులభంగా లభించే పండు. ఈ పండు తినడానికి సులభంగా, రుచిగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, సి, బి, కాల్షియం, ఐరన్ మరియు ఫాస్పరస్ వంటి వివిధ ఖనిజాలు ఉన్నాయి. ఇది మీ జుట్టు, చర్మం మరియు మొత్తం ఆరోగ్యానికి మంచిది.
బొప్పాయి తరచుగా బరువు తగ్గడంతో ముడిపడి ఉంటుంది. బొప్పాయి డైట్ ప్లాన్ అనేది నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే అనుసరించాల్సిన ప్రణాళిక. మెరుగైన ఫలితాల కోసం ఈ డైట్ ప్లాన్‌లో మార్పులు చేయకూడదు. ఈ బొప్పాయి డైట్ ప్లాన్ 48 గంటలుగా ఉండాలి. దీన్ని అనుసరించడం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారు.
100 గ్రాములకు 32 కేలరీలు మాత్రమే ఉన్నందున.. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులకు బొప్పాయి అత్యంత ప్రయోజనకరమైన పండు అని డైటీషియన్ సువిధి జైన్ తెలిపారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటమే కాకుండా విటమిన్ ఎ, సి, ఇ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని జైన్ చెప్పారు. బొప్పాయిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు తక్కువ కేలరీలతో సంతృప్తి చెందవచ్చు.
బొప్పాయిలో కేలరీలు తక్కవగా ఉండి.. ఫైబర్(Fiber) ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గే డైట్ లో దీన్ని కూడా చేర్చుకుంటే లాభం ఉంటుంది. అయితే వారంలో 2 కిలోలు తగ్గకపోవచ్చు. కానీ బరువు తగ్గేందుకు మాత్రం ఇది ఉపయోగపడుతుంది.
బొప్పాయిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపుకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. పాపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పొట్టలోని పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, పైల్స్ సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. బొప్పాయి అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయిన వారికి బొప్పాయి తినమని సలహా ఇస్తారు.