Oppo Reno8 4G । ఒప్పో Renoలో 4G వెర్షన్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర చూస్తే షాక్!-oppo reno8 4g smartphone launched the price will amaze you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo Reno8 4g । ఒప్పో Renoలో 4g వెర్షన్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర చూస్తే షాక్!

Oppo Reno8 4G । ఒప్పో Renoలో 4G వెర్షన్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర చూస్తే షాక్!

HT Telugu Desk HT Telugu
Aug 18, 2022 09:40 PM IST

ఒప్పో ఇదివరకే Oppo Reno8 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. ఇప్పుడు ఇదే మోడల్‌లో 4G వెర్షన్‌ను కూడా తీసుకొచ్చింది. ఆ వివరాలు చూడండి.

<p>Oppo Reno8 4G</p>
Oppo Reno8 4G

చైనీస్ టెక్నాలజీ దిగ్గజం ఒప్పో తమ Reno 8 సిరీస్‌లో మరొక స్మార్ట్‌ఫోన్‌ను చేర్చింది. Oppo Reno8లో 4G వెర్షన్‌ను ఆవిష్కరించింది. Oppo Reno8 5G వెర్షన్‌ను ఇదివరకే భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా Oppo Reno8 4G స్మార్ట్‌ఫోన్‌ను ఇండోనేషియన్ మార్కెట్లో విడుదల చేసింది. త్వరలోనే దీనిని భారతీయ మార్కెట్లోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Oppo Reno8 4G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు ప్రీ-బుకింగ్స్ కోసం అందుబాటులో ఉంది. JD.com, Shopee అలాగే Lazada వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఈ ఫోన్ ప్రస్తుతం లిస్టింగ్ లోకి వచ్చింది. ఆగస్టు 26, శుక్రవారం నుంచి ఈ హ్యాండ్ సెట్ ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.

సరికొత్త Oppo Reno8 4G స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM, 256GB అంతర్గత నిల్వతో ఏకైక కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంటుంది. ర్యామ్ కెపాసిటీని 13GB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ డాన్‌లైట్ గోల్డ్, స్టార్‌లైట్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

మరి Oppo Reno 4G వెర్షన్‌లో మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి. దీని ధర ఎంత ఉంది? తదితర విషయాలను ఈ కింద పరిశీలించండి.

Oppo Reno 8 4G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.43 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే
  • 8GB RAM, 256GB స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP + 2 MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 32 MP సెల్ఫీ స్నాపర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జర్

కనెక్టివిటీ పరంగా 4G LTE, NFC, Wi-Fi 802.11a/b/g/n, బ్లూటూత్ v5, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, GPS/A-GPS, గ్లోనాస్, OTG , USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

ఇండోనేషియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర IDR 4,999,000/- (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 26,879)

ధరను బట్టి ఇది చాలా ఖరీదైన ఫోన్ గా చెప్పవచ్చు. అయితే ఈ ధరతో భారతీయ మార్కెట్లో ఇంతకంటే మెరుగైన 5G ప్రీమియం రేంజ్ ఫోన్లు లభిస్తాయి. కాబట్టి ఈ ఫోన్ ఇక్కడ విడుదల చేయాల్సి వస్తే రూ. 20 వేల లోపు ధర నిర్ణయించాల్సి ఉంటుంది.

Whats_app_banner