Onion Juice For Hairs : ఇలా చేస్తే కొన్ని రోజుల్లో చుండ్రు మాయం.. జుట్టు సమస్యలకు తక్షణ పరిష్కారం-onion juice control dandruff and how to use it heres simple ways ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Onion Juice For Hairs : ఇలా చేస్తే కొన్ని రోజుల్లో చుండ్రు మాయం.. జుట్టు సమస్యలకు తక్షణ పరిష్కారం

Onion Juice For Hairs : ఇలా చేస్తే కొన్ని రోజుల్లో చుండ్రు మాయం.. జుట్టు సమస్యలకు తక్షణ పరిష్కారం

Anand Sai HT Telugu
Nov 20, 2023 05:00 PM IST

Onion Juice For Hairs : వందలో 90 మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఇక చుండ్రుతో ఇబ్బంది పడే వారు బోలేడు. ఉల్లిపాయ రసం ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసం

జుట్టు రాలడానికి, చుండ్రుకు అనేక కారణాలు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా జుట్టు సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అదే ఇంట్లోనే కొన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం కొన్ని రోజుల్లోనే మీ జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. చుండ్రుతో ఇబ్బంది పడేవారు.. కేవలం 7 రోజుల్లో ఉల్లిపాయ రసం ద్వారా వదిలించుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చుండ్రుతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయోజనం ఉండట్లేదు. చండ్రును వదిలించుకోవడానికి, ఉల్లిపాయ రసాన్ని సరిగ్గా ఉపయోగించేందుకు ఇక్కడ అనేక మార్గాలు ఉన్నాయి.

ఉల్లిపాయ రసం తీసుకుని తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఈ రసాన్ని వారానికి రెండు సార్లు తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.

కొద్దిగా నిమ్మరసం, ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు పట్టిస్తే శిరోజాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి జుట్టు పెరుగుతుంది. ఇలా రెండు రోజులకు ఒకసారి చేయాలి. చుండ్రు సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది.

ఉల్లిపాయ రసంలో అలోవెరా జెల్ మిక్స్ చేసి, తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే తలలోని జిడ్డు తగ్గుతుంది. అలాగే చుండ్రును దూరం చేస్తుంది. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.

పచ్చి బీట్‌రూట్‌ను పేస్ట్‌గా తీసుకుని దానిలో ఉల్లిపాయ రసాన్ని కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య అదుపులోకి వస్తుంది.. రోజూ ఇలా చేస్తే చాలు. అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు.

ఉల్లిపాయ రసంతో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు, జుట్టుకు అప్లై చేయండి. అలాగే టవల్ తీసుకుని తలకు చుట్టుకుని అరగంట సేపు ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా వారానికోసారి చేస్తే స్కాల్ప్ ఇరిటేషన్ తగ్గి చుండ్రు తగ్గుతుంది.

నిమ్మరసం, కొబ్బరినూనె, ఉల్లిపాయ రసం కలిపిన మిశ్రమాన్ని తీసుకుని తలకు పట్టించి 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత తేలికపాటి క్లెన్సింగ్ షాంపూని ఉపయోగించి కడగాలి. ఇలా చేయడం వల్ల చుండ్రుకు సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇది వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.

యాపిల్ జ్యూస్‌లో ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు పట్టించాలి. సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి మీ జుట్టును బాగా కడగాలి. జుట్టు రాలడం, చుండ్రు సమస్య నుండి బయటపడండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.

Whats_app_banner