ఆయుర్వేదంలో కలబందను ఔషద మొక్కగా పిలుస్తారు. దీనివల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Oct 08, 2023
Hindustan Times Telugu
కలబందలో ఉండే శీతలీకరణ గుణాలు చర్మ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, కీళ్ల నొప్పులు వంటి అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతుంది.
image credit to unsplash
కలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది.
image credit to unsplash
రెగ్యులర్‌గా తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అలోవెరా జ్యూస్ వ్యాధితో పోరాడే శక్తిని పెంచుతుంది. అలర్జీలను దూరం చేస్తుంది.
image credit to unsplash
కలబంద రసాన్ని రోజూ తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
image credit to unsplash
కలబంద మొక్కలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, పొటాషియం, జింక్, సోడియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఈ పోషకాలన్నీ మీ శరీరానికి అందుతాయి.
image credit to unsplash
కలబంద పూర్తిగా సహజమైనది. ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఇది అందరికీ పని చేయకపోవచ్చు. మీరు దీనిని తినే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి