Oil Pulling Benefits : పిప్పళ్లు, నోటి దుర్వాసనను తగ్గించుకోవాలంటే.. ఆయిల్ పుల్లింగ్ చేయాల్సిందే..-oil pulling benefits for complete mouth health here is the method and benefits and the science behind it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oil Pulling Benefits : పిప్పళ్లు, నోటి దుర్వాసనను తగ్గించుకోవాలంటే.. ఆయిల్ పుల్లింగ్ చేయాల్సిందే..

Oil Pulling Benefits : పిప్పళ్లు, నోటి దుర్వాసనను తగ్గించుకోవాలంటే.. ఆయిల్ పుల్లింగ్ చేయాల్సిందే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 25, 2023 07:12 AM IST

Oil Pulling Benefits : ఆయిల్ పుల్లింగ్ అని విని ఉంటారు కానీ.. చాలా మందికి అది ఏంటి అనేది కూడా తెలియదు. ఇది చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన నుంచి ఉపశమనం అందించే పురాతన టెక్నిక్. నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించుకోవడం కోసం దీనిని ఫాలో అవుతూ ఉంటారు. మరి దీని విధానం ఏమిటి? ప్రయోజనాలు, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయిల్ పుల్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో..
ఆయిల్ పుల్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో..

Oil Pulling Benefits : నోటిలో చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, నోటి దుర్వాసనను నివారించడానికి, కావిటీస్ నుంచి దూరంగా ఉంచడంలో ఆయిల్ పుల్లింగ్​కి మరేది సాటి లేదు. అందుకే దీనిని ఓ గొప్ప జీవనశైలి అభ్యాసంగా చెప్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. మీ రోజూవారీ విధానంలో ఆయిల్​ పుల్లింగ్ ఎందుకు చేర్చుకోవచ్చో తెలుసుకుందాం.

అయితే ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయవచ్చు? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఏమిటి? దీనిని ఎలా ప్రారంభించాలి? వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయిల్ పుల్లింగ్ దశలు

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి, నువ్వులు లేదా ఆలివ్ నూనె, మీకు నచ్చిన వాటిని తీసుకోండి. దీన్ని నోటిలో వేసుకుని.. 15 నుంచి 20 నిమిషాల పాటు మీ నోటిలో పుక్కిలించండి. మీరు దానిని మింగకూడదు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత.. ఈ నూనెను ఒక డబ్బాలో ఉమ్మివేయండి. వాష్ బేసిన్, సింక్ లేదా టాయిలెట్‌లో ఉమ్మివేయకండి. దీని వల్ల నీరు వెళ్లేందుకు అడ్డు ఏర్పడుతుంది. అనంతరం మీ నోటిని నీటితో శుభ్రం చేసుకోండి.

ఆయిల్ పుల్లింగ్ వెనుక ఉన్న సైన్స్

ఈ ఆయిల్ పుల్లింగ్.. మీ నోటి ఆరోగ్యానికి ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే దాని ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది..

మీరు స్విష్ చేసే నూనె యాంటీఆక్సిడెంట్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా సెల్ గోడను నాశనం చేస్తుంది. వాటిని చంపుతుంది. నూనె కణ త్వచాల లిపిడ్ పొరను బయటకు తీసి వాటిని బంధిస్తుంది.

మీరు స్క్విష్ చేస్తున్నప్పుడు నోటిలో నూనె పరిమాణం పెరుగుతూనే ఉంటుంది. ఇది గరిష్టంగా చనిపోయిన బ్యాక్టీరియాను ఉమ్మివేయడంలో మీకు సహాయపడుతుంది. నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. వాస్తవానికి మన నోటిలో 700 కంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియా ఉన్నాయి. ఆయిల్ పుల్లింగ్‌తో, సైన్స్ మద్దతుతో మీరు వాటిని తగ్గించవచ్చు. 75 మందిపై చేసిన ఓ అధ్యయనంలో.. ఆయిల్ పుల్లింగ్ నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను గణనీయంగా తగ్గించింది.

చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

నోటిలో ఉండే టాక్సిన్స్ అనేక చిగుళ్ల సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి. అత్యంత సాధారణమైన వాటిలో చిగురువాపు ఒకటి. ఇది క్రమంగా రక్తస్రావం చేసే చిగుళ్ల వాపునకు దారితీస్తుంది.

ఇలాంటి నోటి కండిషన్ నుంచి దూరంగా ఉంచడంలో ఆయిల్ పుల్లింగ్ సమర్థవంతంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది వాపును తగ్గిస్తుంది. చిగురువాపుతో బాధపడుతున్న 60 మంది వ్యక్తులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో 30 రోజుల పాటు ఆయిల్ పుల్లింగ్ చేసిన వారి పరిస్థితి దీనివల్ల మెరుగుపడిందని వెల్లడైంది.

పిప్పళ్లు నిరోధించడానికి సహాయపడుతుంది

పిల్లలు, పెద్దలలో కావిటీస్ అనేది సాధారణ సమస్య. నిర్వహించిన వివిధ అధ్యయనాల ప్రకారం.. ఆయిల్ పుల్లింగ్ నోటిలో ఉండే బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తుంది. కాబట్టి కావిటీస్ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది మీ లాలాజలంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను కూడా తగ్గిస్తుంది.

నోటి దుర్వాసనను తగ్గిస్తుంది..

నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా నోటి పరిశుభ్రత, నాలుక పూత వల్ల ఈ సమస్యలు వస్తాయి. అయితే ఆయిల్ పుల్లింగ్‌తో మీరు రోజంతా మీ శ్వాసలో తాజాదనాన్ని అనుభవించవచ్చు.

2011లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. నోటి దుర్వాసనను తగ్గించే విషయంలో ఆయిల్ పుల్లింగ్ మౌత్ వాష్ వలె ప్రభావవంతంగా ఉంటుందని వెల్లడైంది. నోటి దుర్వాసనను తగ్గించేందుకు ఇది సహజమైన ప్రత్యామ్నాయం.

సైనస్‌ను సమస్యలను దూరం చేస్తుంది..

దీనికి కొన్ని క్లినికల్ అధ్యయనాలు మాత్రమే ఉన్నప్పటికీ.. ఆయిల్ పుల్లింగ్ మీ సైనస్ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. సైనస్ నోరు లేదా నోటి కుహరంతో ముడిపడి ఉంది. కాబట్టి ఈ పురాతన టెక్నిక్​తో.. మీ సైనస్‌లపై దాడి చేసే అనేక అంటువ్యాధులు, బ్యాక్టీరియాను నిరోధించవచ్చు. అందువల్ల మీరు సైనస్ సమస్యలతో బాధపడుతున్న వారైతే.. మీరు ఆయిల్ పుల్లింగ్‌ని ప్రయత్నించవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం