Get Rid of Bad Breath । దగ్గరగా వెళ్లాలి అంటే ఇబ్బందిగా ఉందా? నోటి దుర్వాసనను ఇలా పోగొట్టుకోండి!
Get Rid of Bad Breath: నోటి దుర్వాసన మీతో అనుబంధం ఉన్నవారికి చికాకును కలిగిస్తుంది. మీకు ఇబ్బందికరంగా ఉమ్టుంది. ఇలా పోగొట్టుకోండి.
ప్రతిరోజూ వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం, నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నోటి దుర్వాసన, దంతక్షయ సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా నోటి దుర్వాసన కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయకపోయినా, మీతో అనుబంధం ఉన్నవారికి చికాకు తెప్పిస్తుంది. మీరు తీసుకునే ఆహారం, మీ శరీర పరిశుభ్రత కూడా నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. ఒక్కోసారి ఎల్లప్పుడూ పరిశుభ్రత గురించి ఆలోచించే వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఏదైనా అంతర్లీనంగా ఉండే వ్యాధికి సంకేతం కావచ్చు. అటువంటి సందర్భంలో వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
నోటి దుర్వాసనకు కారణాలు ఏమిటి?
దంత వ్యాధులు, పేగు సమస్యలు, ఎసిడిటీ, మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా తక్కువ నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దంతాలు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది నోటి దుర్వాసనకు కారణమవుతుంది. దీనితో పాటు, ధూమపానం లేదా పొగాకు నమలడం కూడా నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు.
Ways to Get Rid of Bad Breath- నోటి దుర్వాసనను ఎలా నివారించాలి?
నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి కొన్ని ఇంటి నివారణలు అనుసరించవచ్చు, దంత పరిశుభ్రతపై శ్రద్ధ చూపడం, పుష్కలంగా నీరు త్రాగడం, ఎక్కువ పండ్లు, కూరగాయలు తినడం, చక్కెర ఆహారాలు, పొగాకు ఆధారిత ఉత్పత్తులను తగ్గించడం, రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం వలన నోటి దుర్వాసన తొలగించుకోవచ్చు.
ప్రతిరోజూ ఉదయం మీ దంతాలను బ్రష్ చేయడం, టంగ్ క్లీనర్ ఉపయోగించడం వల్ల ముందు రోజు రాత్రి మీ నోటిలో పేరుకుపోయిన అన్ని విషపదార్ధాలను తొలగించవచ్చు. అంతేకాదు, రాత్రిపూట బ్రష్, ఫ్లాస్ చేస్తే మీ నోరు శుభ్రంగా ఉంటుంది. ఇది మీ పేగు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మరిన్ని చిట్కాలను ఇక్కడ చూడండి.
భోజనం తర్వాత సోంఫ్ తినండి
భోజనం తర్వాత సోంఫ్ తినండి. ఈ విత్తనాలు జీర్ణశక్తిని పెంచే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటాయి. ఇవి లాలాజల ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఇది నోరు పొడిబారకుండా చేస్తుంది. సోంఫ్ గింజలు సుగంధ రుచిని కలిగి ఉంటాయి. అందువలన సువాసన చాలా కాలం పాటు ఉంటుంది. ఇది మీ నోటి దుర్వాసనను నివారిస్తుంది.
భోజనం తర్వాత నోరు కడుక్కోవాలి
ఆయుర్వేదం ప్రకారం, భోజనం తర్వాత నీరు త్రాగకూడదు. ఎందుకంటే ఇది మీ జీవక్రియను నెమ్మదిస్తుంది. కానీ నోరు శుభ్రం చేయడానికి నీరు అవసరం. ముఖ్యంగా రాత్రి భోజనం తిన్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు పుక్కిలించి, నోటిని శుభ్రం చేయండి.
నీరు పుష్కలంగా త్రాగాలి
శరీరం ప్రతి పనికి, ముఖ్యంగా నోటి ఆరోగ్యానికి తాగునీరు చాలా అవసరం. వైద్యుల ప్రకారం, మీ మూత్రం రంగు పసుపు రంగులో కనిపించకుండా ఉండటానికి మీరు తగినంత నీరు త్రాగాలి. మూత్రం రంగులో ఉంటే, మీరు తక్కువ నీరు త్రాగుతున్నారని అర్థం. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి.
ఆహారంలో సర్దుబాట్లు
నోటి దుర్వాసన కలిగించే ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం కూడా నోటి దుర్వాసనతో ముడిపడి ఉంటుంది, కాబట్టి తగ్గించాలి. అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, తరచుగా నోటికి పనిపెట్టడం కూడా తగ్గించాలి.
పొగాకు అలవాటు మానుకోండి
ధూమపానం క్యాన్సర్‌ను కలిగించడమే కాకుండా, మీ చిగుళ్ళను దెబ్బతీస్తుంది, మీ దంతాలను మరక చేస్తుంది, అలాగే మీకు నోటి దుర్వాసనను కలిగిస్తుంది.