Diabetes: వయసును బట్టి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎంతలో ఉండాలంటే!-normal levels blood sugar levels chart for kids and adults ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Normal Levels Blood Sugar Levels Chart For Kids And Adults

Diabetes: వయసును బట్టి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎంతలో ఉండాలంటే!

HT Telugu Desk HT Telugu
Jun 19, 2022 07:13 PM IST

షుగర్ లెవెల్ ఎంత ఉండాలో మీకు తెలుసా? వయస్సును బట్టి కూడా షుగర్ లెవెల్ మారుతూ ఉంటుంది. తినకముందు, తిన్న తరువాత ఎంత ఉండాలో తెలుసుకోండి.

blood sugar
blood sugar

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. దీర్ఘకాలం బాధించే ఈ మొండి వ్యాధిని నయం చేయడం చాలా కష్టం. దీనికి ఇంకా నివారణ లేదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వ్యాధికి మూల కారణం అదుపు తప్పిన జీవనశైలి, ఆహారం. కాబట్టి డైట్‌లో మార్పులు చేయడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. సాధరణంగా వ్యక్తుల వయసులను బట్టి రక్తంలో చక్కెర స్థాయిలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఏ వయస్సులో ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం-

50 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయి ఎంతలో ఉండాలి:

50-60 సంవత్సరాల వయస్సు వారికి, ఫాస్టింగ్ సమయంలో రక్తంలో షుగర్ స్థాయిలు 90 నుండి 130 mg/dL ఉండాలి. మధ్యాహ్న భోజనం తర్వాత 140 mg/dl కంటే తక్కువగా ఉండాలి. రాత్రి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 150 mg/dl ఉంటే అది సాధారణమైనదిగా పరిగణిస్తారు

పాస్టింగ్ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు సాధారణ రక్తంలో చక్కెర స్థాయి విలువలు 70-100 mg/dl వరకు ఉండాలి. కానీ 100-125mg/dl స్థాయికి మించి షుగర్ లెవల్స్ ఉంటే అది ప్రిడయాబెటిస్ కండిషన్‌గా పరిగణిస్తారు. సాధారణంగా డయాబెటిక్ బాధపడుతున్న వారిలో చక్కెర స్థాయిలు 126mg/dl కంటే ఎక్కువగా ఉంటాయి. దీన్ని నియంత్రించాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

భోజనం చేసిన రెండు గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయి ఎలా ఉండాలి

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెద్దవారిలో చక్కెర స్థాయిలు భోజనానికి ముందు 70 నుండి 130 mg/dL ఉండాలి. భోజనం చేసిన 2 గంటల తర్వాత 140 mg/dL కంటే తక్కువగా షుగర్ లెవల్స్ ఉండాలి.

నిద్రవేళలో రక్తంలో చక్కెర స్థాయి ఎంతలో ఉండాలి

6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు 70 నుండి 180 mg/dL వరకు 6 నుండి 12 సంవత్సరాల పిల్లలకు 70 నుండి 150 mg/dL, ఇక 13 నుండి 19 సంవత్సరాల వయస్సు పిల్లలకు 90 నుండి 150 mg/dL వరకు రక్తంలో చక్కెర నిల్వలు ఉండడం సాధారణం. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, రక్తంలో చక్కెర స్థాయి 90 నుండి 150 mg/dL స్థాయిలో ఉండాలి.

రక్తంలో చక్కెర పెరిగినప్పుడు ఏమి జరుగుతుంది?

రక్తంలో చక్కెర స్థాయి అధికంగా పెరగడం వల్ల, అలసట, టెన్షన్, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, బరువు తగ్గడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం, తరచుగా మూత్రవిసర్జన, ఎక్కువగా దాహం వేయడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. చక్కెర నిల్వలు ప్రమాదకర స్థాయి చేరుకుంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయే ప్రమాదం ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్