Natural Hair Packs : ఈ హెయిర్ ప్యాక్స్ ఉపయోగిస్తే.. తాటిచెట్టులా మీ జుట్టు పెరుగుతుంది!-natural hair packs to growth hairs and prevention of hair loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natural Hair Packs : ఈ హెయిర్ ప్యాక్స్ ఉపయోగిస్తే.. తాటిచెట్టులా మీ జుట్టు పెరుగుతుంది!

Natural Hair Packs : ఈ హెయిర్ ప్యాక్స్ ఉపయోగిస్తే.. తాటిచెట్టులా మీ జుట్టు పెరుగుతుంది!

HT Telugu Desk HT Telugu
Sep 09, 2023 11:15 AM IST

Natural Hair Packs : జుట్టు మెరుస్తూ ఉండాలని చాలా మందికి ఉంటుంది. తాటిచెట్టులా పొడుగ్గా, అడవిలా దట్టంగా వెంట్రుకలు కావాలని అందరూ అనుకుంటారు. దీనికోసం కొన్ని సహజ జుట్టు సంరక్షణ చిట్కాలను అనుసరించాలి.

హెయిర్ కేర్ టిప్స్
హెయిర్ కేర్ టిప్స్ (unsplash)

ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టును మెయింటెన్‍ చేయడం అందంలో ముఖ్యమైన భాగం. అయితే కాలుష్యం, ఒత్తిడి, సరైన జుట్టు సంరక్షణ(Hair Care) లేకపోవడంతో జుట్టు రాలుతుంది. అలాగే ఇది డ్రై హెయిర్, జుట్టు పెరుగుదల(Hair Growth) లేకపోవడం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, సహజంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే అనేక హెయిర్ మాస్క్‌లు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

కొబ్బరి నూనె(Coconut Hair Oil) పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. జుట్టు మూలాలను ఉత్తేజపరిచే సామర్థ్యం కారణంగా కరివేపాకు జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తారు. ఈ హెయిర్ మాస్క్‌(Hair Mask)ను సిద్ధం చేయడానికి, పాన్‌లో ఒక కప్పు కొబ్బరి నూనెను వేడి చేయండి. తర్వాత అందులో కొన్ని కరివేపాకులను వేసి నల్లగా మారే వరకు వేడి చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి తలకు పట్టించాలి. సున్నితంగా మసాజ్ చేయండి. ఇది మీ తలకు పోషణ, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఒక గంట లేదా రాత్రిపూట అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి.

ఉల్లిపాయలలో సల్ఫర్ ఉంటుంది. ఇది మీ తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. తేనె(Honey) సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది లోపల నుండి జుట్టును పోషిస్తుంది. ఉల్లిపాయను గ్రైండ్ చేసి, రసాన్ని వడపోసి విడిగా తీసుకోవాలి. ఉల్లిపాయ రసం, తేనె సమాన భాగాలుగా తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి బాగా మసాజ్ చేయండి. 30 నిమిషాల తరువాత జుట్టును గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

కలబంద జుట్టు పెరుగుదల(Alovera For Hair Growth) లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఆముదం జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు విరిగిపోకుండా చేస్తుంది. ఒక గిన్నెలో తాజా కలబంద జెల్, ఆముదం నూనె సమాన భాగాలుగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు రూట్ నుండి అప్లై చేసి, గంట తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.

మెంతి గింజల్లో(Fenugreek Seeds) ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టును బలోపేతం చేస్తాయి. జుట్టు చిట్లడం తగ్గిస్తుంది. పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పెరుగు సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది. ఇది మీ జుట్టుకు మెరుపును తీసుకొస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను అర కప్పు పెరుగుతో బాగా కలపండి. దీన్ని మీ తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.

Whats_app_banner