Contraception myths: గర్భనిరోధక మాత్రల గురించిన అపోహలు, వాటికి సమాధానాలు తెల్సుకోండి-myths and facts about contraceptive pills and methods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Contraception Myths: గర్భనిరోధక మాత్రల గురించిన అపోహలు, వాటికి సమాధానాలు తెల్సుకోండి

Contraception myths: గర్భనిరోధక మాత్రల గురించిన అపోహలు, వాటికి సమాధానాలు తెల్సుకోండి

Koutik Pranaya Sree HT Telugu
Sep 25, 2024 07:00 PM IST

Contraception myths: జనన నియంత్రణ లేదా గర్భనిరోధక పద్ధతుల గురించి అనేక అపోహలుంటాయి. వాటి ప్రభావం మీద అనేక సందేహాలుంటాయి. వాస్తవాలేంటో వివరంగా తెల్సుకోండి.

గర్బనిరోదకాల గురించి అపోహలు వాస్తవాలు
గర్బనిరోదకాల గురించి అపోహలు వాస్తవాలు (Shutterstock)

గర్భనిరోధక పద్ధతుల గురించి, ముఖ్యంగా మాత్రల గురించి అనేక అపోహలుంటాయి. గర్బధారణను నివారించడానికి వీటిని వాడతారు. ఈ మాత్రల్లో సాధారణంగా రెండు హార్మోన్లు ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజెన్ ఉంటాయి. లేదా కేవలం ప్రొజెస్టిరాన్ ఉంటుంది. అయితే వీటి వాడకం వల్ల భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ మీద, ఆరోగ్యం మీద, బరువు మీద ప్రభావం పడుతుందని అనేక రకాలుగా వింటూ ఉంటాం. ఇవన్నీ మహిళల్లో గందరగోళం సృష్టిస్తాయి. కాబట్టి గర్భనిరోధక మాత్రల మీద ఉన్న అపోహలు వాస్తవాలు తెల్సుకోండి.

అపోహ # 1: గర్భనిరోధక మాత్రలు బరువు పెంచుతాయి

వాస్తవం: దీనిని నిరూపించడానికి ఆధారాలు, లేదా ఎలాంటి పరిశోధనలు, నిరూపణలు లేవు. కాబట్టి దీన్ని నమ్మలేము. వీటివల్ల బరువు పెరగుతామనే భయం అక్కర్లేదు. భయాందోళనలు చెందకుండా నిపుణులను సంప్రదించి మీ అవసరానికి తగ్గట్లు ఈ మాత్రలను వాడొచ్చు.

అపోహ # 2: సంతానోత్పత్తికి హాని కలిగిస్తాయి

వాస్తవం: గర్భనిరోధక మాత్రలు వాడకం వల్ల తర్వాత సంతానం కనాలనుకున్నప్పుడు కష్టం అని చెబుతుంటారు. కానీ దీనికి సంబంధించి కూడా ఏ పరిశోధనలు నిజమని చెప్పలేదు. ఈ మాత్రల వల్ల నెలసరి క్రమంగా వస్తుంది. సంతానోత్పత్తి అవకాశం పెంచే మంచి విషయం ఇది. అలాగే మానసికి స్థితిని నియంత్రణలో ఉంచడం కూడా ఈ మాత్రలు పనిచేస్తాయి.

అపోహ # 3: ఇవి లైంగికంగా సంక్రమించే అంటు వ్యాధుల (ఎస్టీఐ) నుండి రక్షిస్తాయి

వాస్తవం: ఇది ఎంతమాత్రం నిజం కాదు. నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు, శస్త్రచికిత్సలు, గర్భనిరోధక పరికరాలు (ఐయుడి) లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఎటువంటి పాత్ర పోషించవు. ఇది కూడా పూర్తిగా అపోహ. ఈ మాత్రలు వేసుకున్నంత మాత్రానా కండోమ్స్ లాంటి వాడకం మానేయడం మంచిది కాదు. ఆ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

అపోహ # 4: వీటితో పాటూ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ప్రభావం తగ్గుతుంది

వాస్తవం: లేదు, యాంటీబయాటిక్స్ గర్భనిరోధక మాత్రల సామర్థ్యానికి ఆటంకం కలిగించవు. మీకేదైనా అనారోగ్య సమస్య ఉండి వాటికోసం యాంటీ బయాటిక్స్ వాడాల్సి వస్తే ఒకసారి వైద్యుల్ని సంప్రదిస్తే సరిపోతుంది.

అపోహ # 5: కండోమ్ వల్ల లైంగిక సంతృప్తి తగ్గుతుంది

వాస్తవం: కండోమ్‌లుఅతి చవక అయిన, అందరికీ అందుబాటులో ఉన్న గర్భనిరోధక మార్గం. ఇవి లైంగిక ఆనందాన్ని ప్రభావితం చేయవు. మొదట్లో వాడకం ఇబ్బంది అవ్వచ్చు కానీ, వాటివల్ల ప్రత్యేకంగా ఇబ్బంది ఉండదు.

అపోహ #6: గర్భనిరోధక మాత్రలు ఎక్కువ కాలం వాడకూడదు

వాస్తవం: గర్భం ధరించి బిడ్డను కనాలనుకున్నప్పుడు ఈ మాత్రలు వాడటం ఆపవచ్చు. మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకానీ వాటివల్ల హాని జరుగుతుందని నమ్మి మధ్యలో ఆపేస్తే ఫలితం ఉండదు. సరైన మాత్రను ఎంచుకునే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

Whats_app_banner