Employee Skills: నలుగురితో నారాయణలా కాదు.. సృజనాత్మకత కలిగిన వాడే విజేత!-most important skills you need to succeed at work ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Employee Skills: నలుగురితో నారాయణలా కాదు.. సృజనాత్మకత కలిగిన వాడే విజేత!

Employee Skills: నలుగురితో నారాయణలా కాదు.. సృజనాత్మకత కలిగిన వాడే విజేత!

Rekulapally Saichand HT Telugu
Feb 28, 2022 04:35 PM IST

యాజమాన్యానికి నచ్చేలా పనిచేసేవాడే మంచి ఉద్యోగి. మంచి ఉద్యోగిగా ఉన్నప్పుడే పదోన్నతులు లభిస్తాయి. మంచి వేతనాలు అందుకోగలుతాం. నలుగురితో నారాయణలా కాకుండా అందరికంటే ముందే బాధ్యతలను నెరవేర్చడంలో ముందుండాలి.

<p>ఉద్యోగులు&nbsp;</p>
ఉద్యోగులు

ఉద్యోగ నిర్వాహణలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఎదగాలంటే కష్టపడాలి.. చొరవ తీసుకునే లక్షణం ఉండాలి.  వేగంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. అప్పుడే జీవితంలో ఎదగగలుగుతాం. ఇలాంటి విషయాలను ఆచరణలో పెట్టేవారు తక్కువ మంది ఉంటారు. కానీ అలాంటి వారే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. నలుగురితో నారాయణలా కాకుండా అందరికంటే ముందే బాధ్యతలను నెరవేర్చడంలో ముందుండాలి, సృజనాత్మకంగా ఆలోచించగలగాలి. అవే కెరీర్‌కి ప్లస్‌ అవుతాయి. 

మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా డిగ్రీ పట్టా పొందడం, ఒక సర్టిఫికెట్ కోర్సు నేర్చుకోవడం, లేదా ఏదైనా పనిలో నైపుణ్యాన్ని సాధించడం లాంటి నిర్దిష్టమైన హార్డ్ స్కిల్స్‌ను కలిగి ఉండాలి.  అలాగే మీ విజయానికి, సాఫ్ట్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.

యాజమాన్యానికి నచ్చేలా పనిచేసేవాడే మంచి ఉద్యోగి అనిపించుకుంటాడు. మంచి ఉద్యోగిగా ఉన్నప్పుడే పదోన్నతులు లభిస్తాయి. మంచి వేతనాలు అందుకోగలుతాం. మరి మనకు నచ్చేలా, బాస్ మెచ్చేలా ఎలా పని చేయాలి? ఉద్యోగులు పురోగతి సాధించడానికి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలా అలోచించాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

1. నేర్చుకోవడం

ఉద్యోగి నిరంతర అధ్యయనశీలిగా ఉండాలి.  మారుతున్న పరిస్థితులను వేగంగా గ్రహించి అంతే వేగంగా ఆకళింపు చేసుకోని నేర్చుకోవడం ఉద్యోగికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. ఇది 21వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన నైపుణ్యం. ప్రపంచంలోని ప్రసిద్ధ ఫ్యూచరిస్ట్ ఆల్విన్ టోఫ్లర్ ఏమంటారంటే "21వ శతాబ్దపు నిరక్షరాస్యులు చదవడం, వ్రాయడం రాని వారు కాదు. తిరిగి నేర్చుకోలేని వారు." ఎందుకంటే, ప్రపంచం వేగంగా మారుతుంది కొత్త నైపుణ్యాలు అలవరుచుకోవాలి. రేపు అనేది చాలా వేగంగా వస్తుంది కానీ సక్సెస్ మాత్రం అంత ఈజీగా రాదు. మీ జ్ఞానాన్ని పెంచుకోవడం, ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉండడం చాలా ముఖ్యం.  నిరంతర సాధన ద్వారే అది సాధ్యం.

2. విమర్శ నుండి ప్రశంస

ప్రతిసారి ప్రశంసలే కాదు అప్పుడప్పుడూ విమర్శలూ కూడా ఉంటాయి. పని చేసే చోటులో మీ ఒకరు మాత్రమే కాదు సహోద్యోగులు, బాస్ కూడా ఉంటారు. మీపై వచ్చే విమర్శలకు మీ పనులతో సమాధానం చేప్పాలి.  ఆఫీస్‌ పనుల్లో ఇలాంటివి సహజం.. కానీ మాటలన్నారని బాధపడడం కాకుండా చెప్పినవి జాగ్రత్తగా విని మార్పులు చేర్పులు చేసుకుంటే చాలు. ప్రతి విషయాన్ని పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆలోచించాలి.

3. చురుకుదనం

కార్యాలయాల్లో చురుకుదనంగా ఉండాలి. ప్రతి ఒకరిని సంతోషంగా పలకరిస్తూ ఉండాలి. ఏ పనిని అప్పగించినా ఆస్వాదిస్తూ చేసినప్పుడే చక్కటి ఉత్పాదకతను అందిస్తారు. అదనపు పని చేయాల్సి వచ్చినా, చురుకుదనం చూపిస్తూ పనికి అలవాటు పడాలి.

4. సృజనాత్మకత

సృజనాత్మకత అనేది అందరికీ అవసరమైన కీలకమైన నైపుణ్యం. ఏ రంగంలోనైనా సృజనాత్మకత ఉంటేనే గుర్తింపు లభిస్తుంది. ఎందుకంటే వేగంగా మారుతున్న కాలంలో, యజమానులు తమ కంపెనీకి సంబంధించి భవిష్యత్తు అవకాశాలను ఊహించగలిగి.. వర్తమానానికి అనువుగా వ్యవహరించే ఉద్యోగులకు విలువ ఇస్తారు. క్రియేటివ్‌గా ఆలోచించే వారే కెరీర్‌లో దూసుకెళ్ళగలరు.

5. సమస్యను పరిష్కరించే చొరవ: 

సంస్థలో అన్ని పనులు సాఫీగా సాగవు. కొన్ని సమయాల్లో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో మీరు కొంత సమాచారాన్ని సేకరించి వాటిని పరిష్కారించడానికి సహాయపడండి.

Whats_app_banner

సంబంధిత కథనం