ఉదయం వ్యాయామం చేయాలంటే బద్ధకంగా ఉందా? అయితే ఇలా Stretching చేయండి!-morning stretching routine to energize your body ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Morning Stretching Routine To Energize Your Body

ఉదయం వ్యాయామం చేయాలంటే బద్ధకంగా ఉందా? అయితే ఇలా Stretching చేయండి!

Cat Cow Pose
Cat Cow Pose (Unsplash)

రోజూ ఉదయాన్నే ఉన్నచోటునే మీ శరీరాన్ని, కాళ్లు, చేతులను సాగదీయండి. ఇలా స్ట్రెచింగ్ చేయడం మంచి వ్యాయామంలా ఉంటుంది. దీంతో మీరు ఉదయం నుంచే హుషారుగా, శక్తివంతంగా ఉంటారు.

ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయాలని అనుకున్నా.. అలారం స్నూజ్ చేస్తూ ఇంకాస్త సేపు అనుకుంటూ అలాగే పడుకుంటున్నారా? అయితే మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నచోటులోనే మీ మార్నింగ్ రొటీన్‌ను కొన్ని మార్నింగ్ స్ట్రెచ్‌లతో కూడా రిఫ్రెష్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఉదయాన్నే చేతులు, కాళ్ళు అలాగే శరీరాన్ని వివిధ భంగిమలలో సాగదీయడం ద్వారా మంచి అనుభూతిని కలిగించే సెరోటోనిన్‌ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో మీకు మానసికంగా మంచి స్పృహ లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే శారీరకంగా మీ కండరాలలో కదలిక పెంచి మిమ్మల్ని హుషారుగా చేస్తుంది. శారీరక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మీరు ఉన్నచోటులోనే చేసుకొనే మార్నింగ్ స్ట్రెచింగ్ రొటీన్ ఇక్కడ అందిస్తున్నాం. ఒక్కో స్ట్రెచ్ 5 సార్లు చేయండి.

క్యాట్- కౌ స్ట్రెచ్

క్యాట్- కౌ భంగిమ దీనిని యోగా భాషలో చక్రవాకాసన అని అంటారు. ఉన్నచోటనే చేతులు, మోకాళ్లపై నిల్చుని మెడను పైకి కిందకు స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇది వెన్నెముక, పక్కటెముకలు ఇంకా వీపులో ఒత్తిడిని తగ్గిస్తుంది.

కూర్చుని సైడ్ స్ట్రెచ్

దీనిని యోగాలో పార్శ్వ సుఖాసన అంటారు. ఉన్న చోటున సౌకర్యంగా కూర్చుని భుజాలను చాచుతూ ఎడమవైపు స్ట్రెచ్ చేయాలి, అలాగే కుడివైపు స్ట్రెచ్ చేయాలి. ఇది నిల్చుని కూడా చేయవచ్చు. దీనివల్ల మెడ, చేతులు, మొండెం, తుంటిని రిలాక్స్ చేయవచ్చు.

స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్

దీనిని యోగాలో ఉత్తనాసన అంటారు. లేచి నిలబడి కాళ్లు నిటారుగా ఉంచి మీ వీపును ముందుకు వంచుతూ మీ తల మీ కాళ్లను తగిలేలా స్ట్రెచెస్ చేయండి. ఇలా 5 సార్లు రిపీట్ చేయాలి. దీనివల్ల వెన్నెముక, మీ పిరుదులు, మోకాళ్ళు, కీళ్లలో పటుత్వాన్ని తీసుకువస్తుంది.

ట్రైసెప్ స్ట్రెచ్

ఇది మీ చేతులను సాగదీయడం. ఉన్నచోటునే తటస్థంగా నిలబడి రెండు చేతులను ఒక్కొక్కసారి ఒక్కోవైపు సాగదీయాలి. ముందుగా కుడిచేతును మీ ఛాతి మీదుగా పూర్తిగా ఎడమవైపు సాగదీయండి. ఇలా 5 సార్లు చేసిన తర్వాత ఇప్పుడు ఎడమ చేతును కుడివైపు సాగదీయండి.

స్టాండింగ్ క్వాడ్ స్ట్రెచ్

ఇప్పుడు నిలబడి ఉన్న ఉన్నచోటునే ఒంటి కాలుపై నిల్చుని మరో కాలును వైనకవైపు పిరుదులకు తాకేలా స్ట్రెచ్ చేయాలి. ఒకవైపు 5 సార్లు చేసిన తర్వాత మరోవైపు చేయాలి. దీని ద్వారా తొడ, తుంటిలో సాగిన అనుభూతి కలుగుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్