Monday Motivation : ఆపద వచ్చినా.. అడ్డంకి వచ్చినా.. పరుగును మాత్రం ఆపకండి..
జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దానికోసం మనం ఎక్కడా ఆగిపోకూడదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. ముందుకు సాగిపోవాలి. నేను చేయలేకపోతున్నాను.. పరిస్థితులు సహకరించట్లేదు.. కాస్త బ్రేక్ తీసుకుని చేస్తా అని ఆగిపోవడం కాదు. అనుకున్నదానిని పూర్తి చేశాకే ఆగండి. అప్పుడు మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి.
Monday Morning Vibe : మనం ఏదైనా సాధించాలని ప్రయత్నించినప్పుడు.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు మన జీవితాలను అంకితం చేస్తాము. దాని కోసం పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడతాము. అప్పుడే మనం మన లక్ష్యాలను చేరుకుంటాము. ఆశించిన ఫలితాలు సాధించటానికి.. భవిష్యత్తులో సంతోషంగా ఉండడానికి మనం ఎంతవరకైనా వెళ్తాము. అనుకున్నదాన్ని సాధించుకోవడం కోసం ఎంత దూరం వెళ్లినా పర్లేదు కానీ.. తర్వాత చేద్దాం. తర్వాత చూసుకుందాం. నాకు కాస్త అలసటగా ఉంది ఆగిపోదాం. చేసే మూడ్ లేదు అనుకుంటూ.. లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తే.. మీరు ఎప్పుడూ మీ గమ్యస్థానానికి చేరుకోరు.
కొన్నిసార్లు మనం అలిసిపోవడం అనేది కామన్. నిరంతర పోరాటంలో మనం అలసిపోవచ్చు తప్పులేదు. కానీ అలసిపోయినప్పుడు ఆగిపోకండి. మీ వేగాన్ని కాస్త తగ్గించుకోండి అంతే. మళ్లీ పుంజుకుని వేగంగా ముందుకు సాగండి. అలసిపోయామని ఆగిపోయారో.. మీ ఓటమిని అంగీకరించినట్లే. ఈ సమాజంలో మనం ఆగిపోతే చాలు.. వేరే వాళ్లు ముందుకు వెళ్లిపోతున్నారు. ఎంతగా అంటే మనం వారిని చేరుకోలేనంత దూరంగా.
అలసట అనేది మన జీవితంలో ఒక భాగం. మనం బాగా కష్టపడి పనిచేస్తున్నామని చెప్పేందుకు అలసట మంచి సంకేతం. ఈ మంచి సంకేతం కోసం ఆగిపోకుండా.. ఇంకాస్త ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఈ సమయంలో మనం మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. అలసటను మీరు ఆపలేరు. కానీ కాస్త ఓపికతో ముందుకు వెళ్లడానికి మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. కాస్తైనా మీరు కృంగిపోతే.. మీరు ఆశించిన ఫలితాన్ని ఎప్పటికీ సాధించలేరు. బదులుగా మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది మీ శక్తిని తిరిగి పొందడానికి మీకు సహాయం చేస్తుంది. తద్వారా మీరు మరింత కొత్త శక్తితో మీ ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు. కాబట్టి అలసిపోయినప్పుడు ఎక్కడా ఆగకుండా.. మీరు కోరుకున్న విజయాన్ని సాధించిన తర్వాత మీ ప్రయత్నాన్ని, పరుగుని ఆపండి. మీకు విజయాన్ని అందించే ఏకైక మార్గం ఇది.
సంబంధిత కథనం
టాపిక్