Mango Peel: మామిడి తొక్కను తీసి పడేస్తున్నారా? వాటిలోనే పోషకాలు అన్ని, మామిడి తొక్కలను ఇలా వాడండి-mango peel peeling mangoes all the nutrients are in them use mango peels like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Peel: మామిడి తొక్కను తీసి పడేస్తున్నారా? వాటిలోనే పోషకాలు అన్ని, మామిడి తొక్కలను ఇలా వాడండి

Mango Peel: మామిడి తొక్కను తీసి పడేస్తున్నారా? వాటిలోనే పోషకాలు అన్ని, మామిడి తొక్కలను ఇలా వాడండి

Haritha Chappa HT Telugu
Apr 13, 2024 01:45 PM IST

Mango Peel: మామిడికాయ లేదా మామిడిపండు తినేటప్పుడు చాలామంది మామిడి తొక్కను తీసి పడేస్తారు. నిజానికి మామిడి పండులో ఎన్ని పోషకాలు ఉంటాయో... మామిడి తొక్కలో కూడా అన్ని పోషకాలు ఉంటాయి.

మామిడి పండ్లు తొక్కలు
మామిడి పండ్లు తొక్కలు (Pixabay)

Mango Peel: వేసవి వచ్చిందంటే తీయ తీయని, పుల్ల పుల్లని మామిడి పండ్లను తినేందుకు అంతా సిద్ధమవుతారు. ఎక్కువ మంది ఇష్టపడే పంటలలో మామిడిపండు ఒకటి. దీన్ని తింటూ ఉంటే వచ్చే ఆ అనుభూతే వేరు. ఎక్కువమంది మామిడికాయను తినేటప్పుడు పైన తొక్కను తీసేసి లోపల గుజ్జును తినండి. అలాగే మామిడి పండులో లోపల గుజ్జును తిని తొక్కన పడేసేవారు. ఎంతోమంది నిజానికి తొక్కలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

యాంటీ డయాబెటిక్ లక్షణాలు

మామిడి తొక్కలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి తొక్కతో టీ లేదా డిటాక్స్ డ్రింక్ చేసుకుని తాగడం వల్ల శరీరంలో చక్కెరస్థాయిలో అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు మామిడి తొక్కతో టీ కాచుకొని తాగితే ఎంతో మంచిది. దీనిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఎక్కువ. మామిడి తొక్కలో యాంటీ డయాబెటిక్ ప్రభావాలను కలిగి ఉండే సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా మాంగిఫెరెన్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

క్రిమి సంహారక మందుగా...

మామిడి తొక్క రసాన్ని సహజ పురుగుమందులుగా ఉపయోగపడతాయి. దీనిలో మాంగిఫెరిన్, బెంజోఫెనోన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. మామిడి తొక్కల నుండి తీసిన పదార్థాలు, సహజ క్రిమిసంహారకంగా ఉపయోగపడతాయి. ఇవి పంటలకు, తెగుళ్లు, కీటకాలు వస్తే వాటిని నాశనం చేస్తాయి. కాబట్టి వీటిని సహజ పురుగుమందులుగా వాడుకుంటే రసాయనాలు కలిగిన మందులను వాడాల్సిన అవసరం ఉండదు.

మామిడి తొక్కను మిక్సీలో వేసి రసం తీయాలి. ఆ రసాన్ని చర్మానికి పట్టించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సూర్యుడి నుండి వచ్చే అతి నీలాలోహిత కిరణాలవల్ల సర్వం నష్టపోకుండా ఉంటుంది. దీనిలో చర్మాన్ని రక్షించే ఎన్నో గుణాలు ఉన్నాయి. వేసవిలో ఇలా బయటకు వెళ్లేటప్పుడు ఆ రసాన్ని చేతులకు, కాళ్లకు రాసుకుంటే మంచిది. ఇది వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.

మామిడి తొక్కలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువ. వీటిలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ మామిడి తొక్కలను నోట్లో నమలడం వల్ల నోటి బాక్టీరియా పెరుగుదల ఆగిపోతుంది. మామిడి తొక్కలను కాసేపు నమలడం వల్ల మౌత్ వాష్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇది నోటి పరిశుభ్రతకు దోహదం చేస్తుంది. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి రాకుండా ఉంటాయి.

గాయాలు నయం అయ్యేందుకు కూడా మామిడి తొక్కల్లో ఉండే సమ్మేళనాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి గాయానికి పూయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి. మామిడి తొక్కల సారాన్ని ఇన్ఫెక్షన్లు పెరగకుండా వాడుకోవచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధులు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్‌ను నిరోధించే శక్తి కూడా ఇందులో ఉంది. ఈ మామిడి తోక్కల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు అధికంగా ఉంటాయి. మాంగీఫెరిన్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

WhatsApp channel